సోనారిక.. నీ సొగసైన ఫిగరుకి జోహారిక..!!

Mon Jul 13 2020 16:40:43 GMT+0530 (IST)

Sonarika .. Johar for your elegant figure .. !!

సోనారిక భాదోరియా. అంటే తెలుగు ప్రేక్షకులకు కాస్త సుపరిచితమే. 2015లో నాగశౌర్య హీరోగా నటించిన 'జాదూగాడు' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ముంబైలోనే పుట్టి పెరిగిన ఈ భామ 2011లో 'తుమ్ దేనా సాథ్ మేరా' అనే టీవీ సీరియల్ తో కెమెరా ముందుకు వచ్చింది. ఆ సీరియల్ మంచి పేరు తేవడంతో తర్వాత 'దేవొంకి దేవ్ మహాదేవ్' సీరియల్లో ఛాన్స్ కొట్టేసింది. ఇక అందులో పార్వతి దేవిగా నటించి టీవీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అలా చాలా సీరియళ్లలో మెరిసిన సోనారిక జాదూగాడుతో అడుగుపెట్టి ప్లాప్ అందుకుంది. ఇక ఆ తర్వాత మంచు విష్ణు సరసన 'ఈడోరకం ఆడోరకం' సినిమా చేసి ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది.కానీ ఫస్ట్ నుండి కూడా అమ్మడు గ్లామర్ షో చేయడానికి వెనక్కి తగ్గలేదు. మంచు విష్ణు మూవీలో అందాల ఆరబోత బాగానే చేసింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'స్పీడున్నోడు' సినిమాలో చివరిగా కనిపించింది అమ్మడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో సోనారిక కి తెలుగులో అదే లాస్ట్ సినిమా అయింది. ఆ తర్వాత తమిళంలో ఇంద్రజిత్ అనే సినిమా చేసి మళ్లీ వెండితెర పై కనిపించలేదు. లాభం లేదని మళ్లీ తన కెరీర్ మొదలైన టీవీ సీరియళ్లలోకి వెళ్ళిపోయింది. సోనారిక చివరిగా కనిపించిన సీరియల్ 'ఇష్క్ మే మార్జావా'. ఇక ఆ తర్వాత సీరియళ్లకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది.

ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన ముంబై సుందరి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. తన అభిమానులను ఫోటోషూట్లతో అలరిస్తోంది. సినిమాలలో మిస్ అవుతున్న అందాలన్నీ ఫోటోషూట్లలో ప్రదర్శిస్తుంది. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్టింట హల్చల్ చేస్తోంది. పింక్ ఫ్లవర్స్ కలిగిన వైట్ డ్రెస్ లో చాలా రొమాంటిక్ పోజులతో రెచ్చిపోయింది. సినిమాలు లేకపోయినా సోనారిక ఫిగర్ మాత్రం అదే రేంజిలో మెయింటైన్ చేస్తోంది. సోనారిక ఫిగర్ చూస్తూ ఫిదా అవుతున్న నెటిజన్లు లక్షల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరి త్వరలో ఈ బ్యూటీకి ఏ డైరెక్టర్ అయినా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి!