జాన్వీకి స్పెషల్ గ్రీటింగ్స్ పంపిన సోనమ్ ఖుషీ.. పిక్స్ వైరల్!

Sat Mar 06 2021 22:26:49 GMT+0530 (IST)

Sonam, Khushi sent special greetings to Janvi

బాలీవుడ్ యువనటి జాన్వీకపూర్ 24వ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ యాక్ట్రెస్ సోనమ్ కపూర్ చెల్లి ఖుషీ కపూర్ శనివారం అందమైన త్రోబాక్ ఫోటోలను పోస్ట్ చేశారు. మొదటగా సోనమ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన కజిన్ జాన్వితో కలిసి దిగిన మూడు ఫోటోలను పోస్ట్ చేసింది. ఫస్ట్ ఫోటోలో యంగ్ సోనమ్ బేబీ జాన్వీని తన ఒడిలో పట్టుకొని కూర్చున్న మూమెంట్ చూడవచ్చు. సెకండ్ ఫోటోలో సోనమ్ తన జాన్వీని హగ్ చేసుకొని కనిపించింది. ఈ ఫోటోలో జాన్వీ చేతిలో అవార్డు కూడా ఉండటం విశేషం. అయితే ఫోటోలతో పాటు సోనమ్ కపూర్ అందమైన నోట్ కూడా రాసింది. "నా ప్రియమైన జాను నీకు లైఫ్ లో ఆనందం వెలుగు తప్ప ఇంకేమి కోరట్లేదు. టోటల్ స్టార్..  బోనఫైడ్ దివాగా నువ్ ఎదగాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు. మిస్ యు" అంటూ పోస్ట్ చేసింది.అలాగే జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ కూడా పుట్టినరోజు సందర్బంగా జాన్వీతో కలిసి ఉన్న ఫోటో కోల్లెజ్ ను పోస్ట్ చేసింది. అందులో ఓ ఫోటోలో జాన్వీ తన చెల్లెలిని గట్టిగా హగ్ చేసుకొని ఉంది. ఫోటోలతో పాటు జాన్వీ డాన్స్ చేస్తున్న వీడియో కూడా పోస్ట్ చేసింది జాన్వీ. అలాగే "పుట్టినరోజు శుభాకాంక్షలు మై ఎవరీథింగ్. నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటాను." అని ఖుషి రాసుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీకి సినీ సెలబ్రిటీల నుండి విషెస్ హోరెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. జాన్వీకపూర్ 2018లో ఇషాన్ ఖత్తర్ సరసన 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. అయితే గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' మూవీలో జాన్వీ చివరిసారి కనిపించింది. ప్రస్తుతం హర్రర్ కామెడీ రూహి మూవీ విడుదల గురించి వెయిట్ చేస్తోంది. చూడాలి మరి ఈసారి హిట్ అందుకుంటుందేమో!