పెద్ద మనిషిని పట్టుకుని అలా అనేసిందేంటి?

Mon Feb 17 2020 16:00:02 GMT+0530 (IST)

Sonam Kapoor slams Mohan Bhagwat's divorce comment

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంలో భారతీయ వివాహ వ్యవస్థపై మాట్లాడారు. ఆ సమయంలో ఆయన బాగా డబ్బున్న వారు.. విద్యా వంతులు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. విద్యావంతుల కుటుంబాలు ఎక్కువగా విచ్చిన్నం అవ్వడం మనం చూస్తున్నామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు సమర్ధిస్తూ ఉండగా కొందరు మాత్రం తప్పుబడుతున్నారు.మోహన్ భగవత్ వ్యాఖ్యలపై బాలీవుడ్ హాట్ హీరోయిన్ సోనమ్ కపూర్ సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఈయన అలా ఎలా మాట్లాడతారు. ఇవి తెలివి తక్కువ మాటలు. ఆయన మాటలు ఆయన వెనుకబాటు తనంకు నిదర్శణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలతో ఆయన ప్రతిష్టను తగ్గించుకున్నట్లుగా పేర్కొంది. ఈ విషయమై ఆమెపై చాలా మంది సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ నే విమర్శించే స్థాయి నీకు ఉందా అంటూ స్వయం సేవక్ కార్యకర్తలు అంటున్నారు. నీవు చేసిన సినిమాలు.. నీ ప్రవర్తనతో ఆయన గురించి మాట్లాడే ముందు ఆలోచించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో బాగా డబ్బున్న వారు విడాకులు తీసుకోవడం ఎక్కువగా మనం చూస్తున్నాం. అందుకే ఆ పెద్ద మనిషి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను పట్టుకుని అంత మాట అనేస్తావా అంటూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు సోనమ్ పై ఆగ్రహంతో ఉన్నారు.