ఫోటో స్టోరి: లోహంతో చెక్కిన సొంపుల ఖిల్లా

Mon Jul 06 2020 11:45:55 GMT+0530 (IST)

Sonam Kapoor eye popping show

సాక్షాత్తూ ప్యారిస్ ఫ్యాషన్ ప్రపంచానికే మతి చెడేలా ఈ అమ్మడి హొయలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదివరకూ కేన్స్ సహా ప్యారిస్ ఫ్యాషన్ షోల్లో ఆవిడ చెలరేగిన తీరుకు మంత్రముగ్ధం కాని డిజైనర్లు లేనే లేరు. ఈ సోగ్గత్తెను అందుకే ఫ్యాషనిస్టా అన్నారు. అంతగా ప్రభావితం చేసిన ఆమె ఎవరు? అంటే ది గ్రేట్ కపూర్ డాటర్ సోనమ్ గురించే ఇదంతా. నెప్టోయిజం (నటవారసత్వం) అన్న మాటెత్తితే చాలు అంతెత్తున ఎగిరిపడే సోనమ్ .. లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే అంతే రెబలియన్ స్టైల్లో అలరిస్తోంది. జక్షిస్ మహారాణిలా.. రాగితో పోత పోసిన జలకన్యలా సోనమ్ ఫోజు చూస్తుంటే మతి చెడడం లేదూ?సోనమ్ కపూర్ ఫ్యాషన్ ఎక్స్ పెరిమెంట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సిరీస్ లో ఇదో ప్రయోగం అనే చెప్పాలి. దిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లాడాక ఈవిడ ఫ్యాషన్ మరో లెవల్ కి చేరుకుంది. ప్రత్యేకించి లోహంతో డిజైన్ చేసిన ఈ డిజైనర్ డ్రెస్ కేవలం సోనమ్ ని ఉద్ధేశించి తయారు చేశారని అర్థమవుతోంది.

ఈ ఫోటోని సోషల్ మీడియా లో ఇలా షేర్ చేసిందో లేదో అలా ఫ్యాన్స్ లోకి వైరల్ గా దూసుకెళ్లింది. సోనమ్ నెవ్వర్ బిఫోర్ లుక్ ఇది అంటూ ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. సంజు సినిమా తర్వాత 2019లో రెండు సినిమాల్లో నటించింది. ది జోయా ఫ్యాక్టర్ సినిమాలోనూ నాయికగా నటించింది. 2020లో ఈ అమ్మడు కెరీర్ పరంగా పూర్తిగా ఖాళీ. ప్రస్తుతం దిల్లీలో భర్త అహూజాతో కలిసి నివశిస్తోంది.