అదరహో.. అనిపిస్తున్న సోనమ్ సోయగాల షో!

Thu Jul 16 2020 08:00:31 GMT+0530 (IST)

Sonam Kapoor Stylish pic goes viral

బాలీవుడ్ ఇండస్ట్రీలో సోనమ్ కపూర్ అంటే ఓ ప్రత్యక ఆకర్షణ ఏర్పరచుకుంది. ఎందుకంటే ఎల్లప్పుడూ తన ఆకట్టుకొనే అందాల ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందుతూనే ఉంది. సోషల్ మీడియాలో సోనమ్ కపూర్ పోజులు చూస్తే ఎవరైనా నోరెళ్ళబెట్టి నిలబడిపోవడం ఖాయం. అమ్మడికి పెళ్లి అయిందనే సంగతి అప్పుడప్పుడు మరిచిపోయినట్లు చేస్తోంది. అందుకే కుర్రకారుకు నేత్రానందం కలిగించే సోకుల వడ్డన చేస్తుంది. బాలీవుడ్ హీరోయిన్లు పెళ్ళైన తర్వాత సినీ ఇండస్ట్రీలో గ్లామర్ షో చేయాలనీ ఒక్కసారి కమిట్ అయితే మొగుళ్ళ మాటలు అసలు లెక్కచేయరు. వారిలో ముఖ్యంగా సోనమ్ కపూర్ అయితే భర్తను ఒప్పించి మరీ గ్లామర్ షో చేస్తోంది. ఓసారి ఫోటో చూస్తే అర్ధమవుతుంది అమ్మడు ఎంత స్టైలిష్ లుక్ తో మెరిసిపోతుందో..బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టైలిష్ ముద్దుగుమ్మలు ఉన్నా వారిలో సోనమ్ రూటు మాత్రం సపరేట్ అంటోంది. లేటెస్టుగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్స్.. ఆభరణాలు ప్రెసెంట్ చేయడంలో సోనమ్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఇండియాలోని ట్రెండీ హీరోయిన్లలో సోనమ్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది. సోషల్ మీడియాలో హాలీవుడ్ హీరోయిన్లంత ఫాలోయింగ్ సంపాదించుకుంది. గ్లామర్ షోలో బార్డర్ క్రాస్ చేయడం అమ్మడికి సరదానట. హద్దులు దాటిన ప్రతీసారి ఈ ముద్దుగుమ్మ ఒంపుసొంపులు చూసి మైమరచిపోతున్నారు అభిమానులు. ఇటీవలే ఓ గ్లామర్ ఫోటోలో మెరూన్ సారీ కట్టుకొని కవ్విస్తుంది. పెళ్లి జరిగినా ఇప్పటికీ అందాల ఆరబోతలో అదే దూకుడు ప్రదర్శిస్తూ ఫిదా చేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సోనమ్ సారీ అందాలు హైలైట్ అవుతున్నాయి.