మ్యారీడ్ బ్యూటీ నెవ్వర్ బిఫోర్ బోల్డ్ అవతార్

Wed Jun 09 2021 23:00:01 GMT+0530 (IST)

Sonam Kapoor Latest Photo

కపూర్ గాళ్స్ లో ఫ్యాషనిస్టా అనగానే తొలిగా వినిపించే పేరు సోనమ్ కపూర్. ప్యారిస్ హంసరాణులకే చెమటలు పట్టించిన పనితనం సోనమ్ కే చెల్లింది. స్టార్ హీరో అనీల్ కపూర్ కుమార్తెగా తెరకు పరిచయమైనా తనదైన స్టైల్లో నటిగానూ పాపులరైంది. జాతీయ అవార్డుల్ని అందుకుంది. ఇక ఫ్యాషన్స్ అండ్ స్టైల్స్ పరంగా సోనమ్ నెవ్వర్ బిఫోన్ అనేంతగా ట్రెండ్ సెట్టర్ అయ్యింది.బిజినెస్ మేన్ ఆనంద్ అహూజాని పెళ్లాడాక సోనమ్ స్పీడ్ కాస్త నెమ్మదించిందనే చెప్పాలి. తాజాగా సోనమ్ షేర్ చేసిన ఓ బోల్డెస్ట్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

నేడు ఫ్యాషన్ క్వీన్ సోనమ్ కపూర్ పుట్టినరోజు. 2007 లో సినీరంగంలో ప్రవేశించిన సోనమ్ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా స్థిరపడ్డారు. కేన్స్ సహా ఎన్నో అవార్డ్ వేదికలపై సోనమ్ కి అరుదైన గౌరవం దక్కింది. ఆనంద్ అహుజాతో సోనమ్ ప్రేమ కథ సినిమానే తలపిస్తుంది.

2018 లో ఆనంద్ అహూజాని సోనమ్ పెళ్లాడారు. ప్రేమ్ రతన్ ధన్ పాయో (2015) ప్రమోషన్లలో బిజీగా ఉన్నప్పుడు ఆనంద్ ను ఆమె కలిసింది. అహూజాకి అసలు సోనమ్ తండ్రి గురించి తెలీదట. కామన్ ఫ్రెండ్ ద్వారా సోనమ్ ని కలిసాక లవ్ లో పడిపోయాడు పెళ్లాడేశాడు. ఈ జంట ఆదర్శ జీవనం ప్రతిసారీ చర్చకు వస్తోంది. సోనమ్ తన 35 వ పుట్టినరోజు సందర్భంగా ఆనంద్ `ఎప్పటికీ వాల్ పేపర్` అని వ్యాఖ్యను జోడిస్తూ వారిద్దరి ఫోటోతో శుభాకాంక్షలు తెలిపారు.