ఫోటో స్టోరి: అదుపు తప్పి థై షో ఏమిటిలా!

Sat Jan 18 2020 11:43:22 GMT+0530 (IST)

Sonam Kapoor Glamourous Pose

సోనమ్ కపూర్ - రియాకపూర్ సిస్టర్స్ గురించి పరిచయం అవసరం లేదు. అక్క సోనమ్ పెద్ద స్టార్ అయితే.. చెల్లెలు రియా నిర్మాతగా.. కాస్ట్యూమ్ డిజైనర్ కం బిజినెస్ ఉమెన్ గా కెరీర్ ని సాగిస్తున్నారు. ఇక అక్కా చెల్లెళ్ల మధ్య అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. సోదరి రియా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా సోనమ్ బోలెడంత ప్రచారం చేస్తోంది. సోదరి కోసం ఏం చేయడానికైనా సోనమ్ సిద్ధమే.ఇక రియా డిజైన్స్ కి సోనమ్ చేస్తున్న ప్రచారం కాస్త అదుపు తప్పినట్టే కనిపిస్తోంది. ఏదో వస్త్ర శ్రేణి వ్యాపార వృద్ధి కోసం మరీ ఇంతగా థై షోస్ చేయాలా? పిక్కల పైకి పరికిణీ ధరించాలా? అంటూ తాజాగా సోనమ్ షేర్ చేసిన ఫోటోకి ఘాటైన కామెంట్లు పడిపోతున్నాయి.  సోనమ్ తన పొడుగు కాళ్ల అందాన్ని ఎలివేట్ చేస్తూ.. డెనిమ్స్ ధరించిన ఫోటోని రివీల్ చేసింది.

ఈ కలెక్షన్స్ రియాకి చెందిన వేర్ రీసన్ బ్రాండ్. ఏడబ్ల్యూ19 కలెక్షన్స్ పేరుతో ఈ డిజైన్లకు రూపకల్పన చేశారు. దీనికి సోనమ్ అదిరిపోయే కామెంట్  ని జోడించింది. `ఎంబరాసింగ్ ది నైన్టీస్ డెనిమ్ లుక్ ఇన్ 2020 అంటూ వ్యాఖ్యను జోడించింది. అంటే ఏడాది కిందటి డెనిమ్స్ ధరిస్తేనే మరీ అంతగా కాళ్ల సొగసు ఎలివేట్ అయ్యిందా? అంటూ యూత్ ఒకటే ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఏడాదిలోనే సోనమ్ కాళ్ల పొడవు ఇంచి పెరిగిపోయిందా ? అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. 2020 నాటికే మరీ అంత పొట్టి డ్రెస్ అయిపోయిందా? అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇక ఫ్యాషనిస్టా సోనమ్ కి ఆ  చిట్టి పొట్టి బులుగు డెనిమ్ అదిరిపోయిందన్న పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇటీవల లండన్ లో ఓ క్యాబ్ డ్రైవర్ వల్ల సోనమ్ ఊహించని ప్రమాదం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దానిపై సోషల్ మీడియా ద్వారా సోనమ్ మండిపడింది. ఈ రెండేళ్లలో ఐదారు సినిమాలు చేసిన సోనమ్ మునుముందు దూకుడు పెంచుతుందేమో చూడాలి. అన్నట్టు ది జోయా ఫ్యాక్టర్ (2019) తర్వాత వేరొక సినిమాని ప్రకటించలేదు ఎందుకనో!