ఫోటో స్టొరీ: కాస్మోపాలిటన్ పై కిల్లర్ బ్యూటీ

Wed Sep 11 2019 22:33:25 GMT+0530 (IST)

Sonam Kapoor Glamourous Pose

బాలీవుడ్ లో ఉన్న ఫ్యాషనిస్టాల లిస్టు తీస్తే అందులో సోనమ్ కపూర్ పేరు టాప్-3 లో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.  అనిల్ కపూర్ ముద్దుల కుమార్తె అయిన సోనమ్ సినిమాల్లోకి రాకమునుపు భారీగా ఉండేది.  అయితే ఎప్పుడైతే నటనను కెరీర్ గా ఎంచుకుందో అప్పటి నుంచి కఠినమైన కసరత్తులు చేసి.. డైట్ ఫాలో అయ్యి స్లిమ్ముగా మారింది.  అయితే ఇదంతా జరిగి 12 ఏళ్ళు అయింది లెండి. ఈ 12 ఏళ్ళలో నటిగా తనను తాను నిరూపించుకోవడమే కాకుండా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గా ఎదిగింది.పోయినేడాది తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆనంద్ అహూజాను వివాహం చేసుకున్న తర్వాత సోనమ్ కె. అహూజా గా మారింది.  వివాహమై శ్రీమతిగా మారిన తర్వాత కూడా తన ఫ్యాషన్ సెన్స్.. హాట్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింతగా పెరిగింది.  రీసెంట్ గా సోనమ్ కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ లో పాల్గొంది.  ఈ మ్యాగజైన్ సెప్టెంబర్ ఎడిషన్ కవర్ పేజికి సోనమ్ హాట్నెస్ టచ్ ఇచ్చింది. బ్లాక్ కలర్ లో ఉన్న ఫాక్స్ లెదర్ ప్యాంట్..  బ్రౌన్ -బ్లాక్ కాంబినేషన్ ఉన్న కోటులా కనిపించే షర్టు వేసుకుని ఇన్ షర్టు చేసుకుంది.  కర్లీ హెయిర్ స్టైలింగ్.. రెడ్ కలర్ లిప్ స్టిక్.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్ తో ఒక అంతర్జాతీయ మోడల్ తరహాలో కనిపిస్తోంది.  అందాలను ఫుల్లుగా ధారపోస్తూనే ఎంతో స్టైల్ గా నిలుచుంది. 

ఈ ఎడిషన్ లో "నా వ్యక్తిగత జీవితం.. వృత్తి జీవితం రెండిటిలో నేను చాలా సంతోషంగా ఉన్నాను - సోనమ్ కపూర్ అహూజా" అనే టైటిల్ తో ఒక కథనం కూడా ప్రచురించారు. ఈ కవర్ పేజి ఫోటో నెటిజన్లకు తెగ నచ్చింది. లైక్స్ తో.. కామెంట్లతో రెచ్చిపోయారు. "ఆసమ్ సోనమ్ ".. "మంటలు పెడుతున్న సోనమ్ ".. "Mrs.సెక్సీయస్ట్ ".. "లా జవాబ్" అంటూ పొగడ్తలు కురిపించారు.  ఇక సోనమ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం 'ది జోయా ఫ్యాక్టర్' అనే  రొమాంటిక్ డ్రామాలో నటిస్తోంది.  సెప్టెంబర్ 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.