పెళ్లయినా పరువాల విందులో తగ్గట్లేదుగా.. ఈ సొగసరి!

Fri Jul 03 2020 08:45:52 GMT+0530 (IST)

Sonam Kapoor Chilling At Goa

బాలీవుడ్ ఇండస్ట్రీ లో సోనమ్ కపూర్ అంటే ఓ ప్రత్యేక ఆకర్షణ. ఎప్పుడు చూసినా తాజాగా అప్పుడే సముద్ర తీరంలో దొరికిన ముత్యంలా మెరుస్తూ ఉంటుంది. నిజానికి సోనమ్ మేనిఛాయ కూడా మెరుపులాగే ఉంటుందనుకోండి. ఈ బ్యూటీ ఎల్లప్పుడూ తన అందాల ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందుతూనే ఉంటుంది. అమ్మడి ఫోటోషూట్స్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అప్పుడప్పుడు ఈ భామ పెళ్లయిందనే విషయం పూర్తిగా మరిచిపోయినట్లు అన్పిస్తుంది. ఎందుకంటే పెళ్లయ్యాక సోకుల వడ్డన డోస్ పెంచేసింది. నిజానికి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఒక్కసారి కమిట్ అయితే మొగుళ్ళ మాట అసలు లెక్క చేయరు. అందులో ముఖ్యంగా సోనమ్ కపూర్ మొదటి స్థానం లో ఉంటుంది. కానీ ఇండస్ట్రీ లో మోడరన్ యూత్ ఐకాన్ అనే పదానికి సరిగ్గా సరి పోతుంది సోనమ్.బాలీవుడ్ ఇండస్ట్రీ లో సోనమ్ ని ఫాలో అయ్యే సెలబ్రిటీలు చాలానే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్ దుస్తులు.. ఆభరణాలు పరిచయం చేస్తోంది. అందాల ప్రదర్శనలో హద్దులు దాటడం అమ్మడికి ఎల్లప్పుడూ సరదానే. హద్దులు దాటిన ప్రతీసారి సోనమ్ సొగసులు చూసి లొట్టలేసుకుంటున్న కుర్రాళ్ళు కోట్లలో ఉన్నారు. సోనమ్ ఫోటోషూట్లతో అదే చేస్తుంది. పెళ్ళైనా పరువాల విందులో తగ్గేదే లేదంటూ సినీ అభిమానులను.. గ్లామర్ ప్రేమికులను దాసోహం చేసుకుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి సోనమ్ అందాల ఆరబోత హైలైట్ అవుతోంది. కొత్త కొత్త పోజులలో తనని తాను మరోసారి ఎలివేట్ చేసుకుంది అమ్మడు. ఇటీవలే 20 మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ఇక తాజాగా సముద్రతీరంలో పిక్ షేర్ చేసింది. కేవలం వైట్ షర్ట్ ఒకటి వేసుకొని ఇసుకలో అలా పోజిచ్చింది. అంతే ఆ కెరటాలు కూడా సోనమ్ అందాలను తాకడానికి తెగ ఆరాటపడుతున్నట్లుగా అనిపిస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు!