బికినీ బీచ్ లో చిక్కిన పోలీస్ కమిషనర్ కూతురు!

Wed Apr 21 2021 07:00:01 GMT+0530 (IST)

Sonali Raut Latest Photo

సోషల్ మీడియాల్లో నిరంతరం పోటీపడుతూ వేడెక్కించే భామగా ముంబై మోడల్ కం నటి సోనాలి రౌత్ పాపులర్. కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్ గా పాపులరైన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్  రొమాంటిక్-థ్రిల్లర్ చిత్రం `ది ఎక్స్‌పోస్` తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇందులో హిమేష్ రేషమ్మీయా- యోయో హనీ సింగ్ సరసన ఈ అమ్మడు నటించింది.  సూపర్ మోడల్ ఉజ్జ్వాలా రౌత్ సోదరిగా సోనాలికి మోడలింగ్ కెరీర్ లో ఎదురే లేకుండా ఏలింది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఆశించిన కెరీర్ ని దక్కించుకోలేకపోతోంది.`ది ఎక్స్‌పోజ్` లో నటించాక...రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ లోనూ కనిపించింది. ఆ తర్వాత మళ్లీ కన్నడ చిత్ర దర్శకుడు ఎస్. కె.బషీద్ `99 పర్సంట్ యూజ్ లెస్ ఫెలోస్` అనే చిత్రానికి సంతకం చేసింది. కానీ ఆ మూవీ నుంచి వివాదాల వల్ల తప్పుకుంది. 2016 లో రౌత్ గ్రేట్ గ్రాండ్ మస్తి చిత్రంలో కనిపించింది. ఇటీవల `లిప్ స్టిక్ లగా కే` చిత్రం పాటలో నర్తించింది. అయినా ఇంకా కెరీర్ గ్రాఫ్ ని పెంచుకోవడంలో తడబడుతోంది.

ఇటీవలే ఈ బ్యూటీని వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వరిస్తున్నాయట. కానీ తన చూపు సౌత్ వైపు ఉందని.. ఇతర నాయికల్లానే ఇక్కడ ఓ వెలుగు వెలిగాలని కలలు గంటోందని తెలుస్తోంది. అయితే సౌత్ లో ప్రవేశించాలంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో అంత సులువేమీ కాదు. మల్లూ భామలు సహా ఇతర పరిశ్రమల నుంచి పోటీని ఎదుర్కొని ఇక్కడా రాణించాలి. అప్పుడే తనకంటూ ఓ గుర్తింపు దక్కుతుంది. కానీ ఆ ఒక్క ఛాన్స్ ఎప్పుడు? అన్నదే వేచి చూడాలి. ఇక సోషల్ మీడియాల్లో వరుస బికినీ ఫోటోలతో అంతకంతకు వేడి పెంచుతున్న ఈ బ్యూటీ మరోసారి బీచ్ పరిసరాల్లో బికినీతో ప్రత్యక్షమైంది. ఆ ఫోటో వైరల్ గా మారుతోంది. అన్నట్టు సోనాలి సంఘంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న డిప్యూటీ పోలీస్ కమీషనర్ కుమార్తె అన్న సంగతి కొద్ది మందికే తెలుసు.