Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పెంకుటిల్లు ఎక్కి దిగిరానన్న‌ తుంట‌రి పిల్

By:  Tupaki Desk   |   5 Dec 2020 3:54 AM GMT
ఫోటో స్టోరి: పెంకుటిల్లు ఎక్కి దిగిరానన్న‌ తుంట‌రి పిల్
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న `లెజెండ్` చిత్రంలో న‌టించింది సోనాల్ చౌహాన్. లెజెండ్ విజ‌యం సాధించ‌డం త‌న‌కు క‌లిసొచ్చింది. ఆ త‌ర్వాత శ్రీ‌వాస్ మ‌రోసారి `డిక్టేట‌ర్` లో ఆఫ‌ర్ ద‌క్కించుకుంది. కానీ ఈ మూవీ మిస్ ఫైర్ అయ్యింది.

అటుపై తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఆఫ‌ర్ లేదు. తిరిగి చాలా గ్యాప్ త‌ర్వాత బాల‌య్య న‌టించిన `రూల‌ర్` కోసం కె.ఎస్.ర‌వికుమార్ లాంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సోనాల్ నే ఎంపిక చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రం. సోనాల్ ఈ మూవీలో ఏ రేంజులో గ్లామ‌ర్ ట్రీటిచ్చిందో తెలిసిన‌దే.

సోనాల్ డేర్ డెవిల్ బోల్డ్ యాక్ట్ కుర్రాళ్లలో నిరంత‌రం హాట్ టాపిక్. అయితే అందుకు త‌గ్గ ఆఫ‌ర్లు అయితే లేవ్. సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో హిట్టు మాత్ర‌మే మ‌రో ఛాన్స్ ఇస్తుంది. ఇక ప్ర‌స్తుత స‌న్నివేశంలో మ‌రోసారి ఛాన్సుంటే బాల‌య్య‌నే త‌న‌ని ఆదుకోవాలేమో! సోనాల్ బాలీవుడ్ లోనూ ప్ర‌స్తుతం ఆఫ‌ర్లు క‌రువయ్యాయి. స్కై ఫైర్ అనే వెబ్ సిరీస్ లో న‌టించినా .. ఆ త‌ర్వాత బాలీవుడ్ ఆఫ‌ర్స్ ఏవీ రాలేదు.

ప్ర‌స్తుతానికి సోష‌ల్ మీడియాల్లో స్పీడ్ గా ఉంటోంది. అక్క‌డ లేటెస్ట్ గా ఇలా వేడెక్కించే ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. ఇలా పెంకుటిల్లు ఎక్కి దిగిరానంటోంది తుంట‌రి పిల్ల‌. అదంతా స‌రే కానీ మ‌రోసారి బోయ‌పాటి లేదా శ్రీ‌వాస్ సినిమాల‌తోనే సోనాల్ రీలాంచ్ అవుతుందేమో చూడాలి. బాల‌య్య‌తో శ్రీ‌వాస్ కి కూడా సినిమా ఉంది కాబ‌ట్టి అప్ప‌టికి జాక్ పాట్ త‌గిలేనా అన్న‌ది చూడాలి.