బికినీ బేబ్ ప్రపంచం తలకిందులు

Mon May 20 2019 23:00:01 GMT+0530 (IST)

Sonal Chauhan Bikini Treat

బికినీ బీచ్ విహారంలో స్పెషలిస్టులెందరో. రెగ్యులర్ గా విదేశీ ఒంటరి దీవులకు వెళుతూ అక్కడి నుంచి లైవ్ లో బికినీ బీచ్ విహారానికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేస్తూ ఇన్ స్టాని వేడెక్కించడం చూస్తున్నదే. ఇలియానా.. అదా శర్మ.. నేహా శర్మ.. రియా చక్రవర్తి.. రియా సేన్ .. వీళ్లంతా ఇదే బాపతు. ఇన్ స్టాలో వెతకాలే కానీ బికినీ ట్రీట్ కి కొదవేమీ ఉండదు.వీళ్లకు ధీటైన కాంపిటీషన్ ఇచ్చే వేరొక భామ ఉంది. ప్రస్తుతం కెరీర్ పరంగా సరైన అవకాశాల్లేకపోయినా ఇలాంటి షికార్లతో వేడెక్కించడంలో బిజీ గా ఉంది. ఇంతకీ ఎవరావిడ? అంటే .. పేరు సోనాల్ చౌహాన్. నటసింహా నందమూరి బాలకృష్ణ సరసన `లెజెండ్` చిత్రంలో కథానాయికగా నటించింది. బోయపాటి ప్రోత్సాహంతో `డిక్టేటర్`లోనూ అదిరిపోయే ఐటెమ్ నంబర్ తో అదరగొట్టింది. అటుపై ఆశించిన ఛాన్సులేవీ రాకపోవడంతో కెరీర్ లో వెనకబడింది సోనాల్.

బాలీవుడ్ లో గత ఏడాది `ఫాల్తాన్` లాంటి భారీ మల్టీస్టారర్ లో నటించింది. ఇందులో జాకీ ష్రాఫ్.. అర్జున్ రాంపాల్.. సోనూ సూద్ లాంటి స్టార్లు నటించారు. అలాగే `జాక్ అండ్ జిల్ ` అనే వేరొక చిత్రంలోనూ సోనాల్ నటించింది. అటుపై ఆఫర్లు లేవు. 2019 కెరీర్ మాత్రం డైలమాలో ఉంది. ప్రస్తుతం `స్కై ఫైర్` అనే ఓ హిందీ వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. అరుణ్ రామన్ పుస్తకం ఆధారంగా రూపొందుతున్న సై-ఫై థ్రిల్లర్ ఇది. జీ ఒరిజినల్ లో ఈ వెబ్ సిరీస్ లైవ్ కానుంది. ఈలోగానే ఇదిగో కాస్తంత తీరిక సమయం చిక్కగానే ఇలా విదేశాలకు చెక్కేసింది. అక్కడ ఒంటరి దీవుల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో మస్తు మజా చేస్తోంది. ప్రస్తుతం సోనాల్ బికినీ ఫోటోలు యువతరంలో జోరుగా వైరల్ అవుతున్నాయి. పింక్ బికినీలో 180 డిగ్రీల కోణంలో తలకిందులుగా కనిపిస్తున్న ఈ అమ్మడి లుక్ కి బోయ్స్ ఫిదా అయిపోతున్నారు. ``సన్.. సాండ్ .. వెకేషన్.. పాజిటివ్ వైబ్స్`` అంటూ చాలానే పోయెట్రీని ఈ ఫోటోకి జోడించింది సోనాల్. కనీసం ఈ బికినీ చూశాక అయినా.. కెరీర్ పరంగా ఈ అమ్మడికి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయేమో చూడాలి.