Begin typing your search above and press return to search.

న‌ట‌వార‌సురాళ్ల మ‌ధ్య సంథింగ్ సంథింగ్

By:  Tupaki Desk   |   20 Aug 2022 4:40 AM GMT
న‌ట‌వార‌సురాళ్ల మ‌ధ్య సంథింగ్ సంథింగ్
X
న‌ట‌వార‌సురాళ్లు జాన్వీ క‌పూర్- సారా అలీఖాన్ ఇద్ద‌రూ ఓ చోట చేరితే ఆ సంద‌డే వేరు! క‌లిసే జిమ్ కి వెళ‌తారు.. క‌లిసి షికార్లు చేస్తారు.. క‌లిసే అడ్వెంచ‌ర్ టూర్ లు.. నైట్ పార్టీల‌కు వెళుతుంటారు. ఇంకా చాలా చాలా చేస్తుంటారు!!

స్నేహితురాళ్లు ఒకే సీజ‌న్ లో క‌థానాయిక‌లుగా తెరంగేట్రం చేయ‌డ‌మే గాక‌.. త‌క్కువ స‌మ‌యంలో అసాధార‌ణ‌ ఫ్యాన్ ఫాలోయింగ్ ని స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్నారు. ఆ ఇద్ద‌రూ కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7లో అద్భుత‌మైన ఎపిసోడ్ తో ర‌క్తి క‌ట్టించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ జోడీ క‌లిసి న‌టించే సినిమాని అభిమానులు వీక్షించేందుకు ఆస్కారం లేక‌పోలేదు.

ఇటీవ‌ల ఈ జోడీ కరణ్ టాక్ షోలో చాలా సంగ‌తులు రివీల్ చేశారు. త‌మ బోయ్ ఫ్రెండ్స్ గురించి ఎక్కువ లైక్ చేసే హీరోల గురించి డేట్ కి వెళ్లే హీరోల గురించి కూడా చెప్పారు. ఇప్పుడు ఈ ఇద్దరు అందాల‌భామ‌లు తొలిసారిగా తెరపై క‌లిసి నటించారు. జాన్వీ కపూర్ - సారా అలీ ఖాన్ జోడీ సహనటులుగా మారారు. ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఇరువురూ విభిన్న‌మైన‌ ఎక్స్ ప్రెష‌న్స్ తో కూడుకున్న ఫోటోలను పోస్ట్ చేసారు.

ఫోటోని షేర్ చేసాక జాన్వీ కపూర్ వ్యాఖ్యానిస్తూ.."ట్రావెల్ అడ్వెంచర్స్ 'కాఫీ డేట్స్'.. ఇప్పుడు సహనటులు!" అన్న వ్యాఖ్య‌ను రాయ‌గా.. ".. దానికి సారా 'ఇది నిప్పు' అని సమాధానం ఇచ్చింది. సారా అలీ ఖాన్ ఇంకా ఇలా రాశారు.

"వేడి వేడి కాఫీ నుండి ఇప్పుడు మేము కో-న‌టులుగా చిత్రీకరణ‌లో పాల్గొన్నాం. వేచి ఉండండి. మమ్మల్ని చూడండి.. మీరు ఏమనుకుంటున్నారో మాకు చెప్పండి" అని వ్యాఖ్య‌ను జోడించింది. ఇది పేల్తుంది! అంటూ జాన్వీ మ‌రో వ్యాఖ్య‌ను జోడించింది.

ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల న‌డుమ సంథింగ్ సంథింగ్ అగ్నిప‌ర్వ‌తం విస్పోట‌నంలా మారుతుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న ర‌య్ మంటూ ఫ్యాన్స్ గుండెల్లోకి దూసుకెళ్ల‌డం ఖాయం. అన్న‌ట్టు ఆ ఇద్ద‌రూ క‌లిసి న‌టించే ఫీచ‌ర్ ఫిలిం గురించి ఏదైనా ప్ర‌క‌ట‌న చేస్తే బావుండేది. గురువుగారైన‌ క‌ర‌ణ్ జోహార్ అలాంటి ప్ర‌ణాళిక‌తో ఉన్నారా లేరా? అన్న‌ది కూడా తెలియాల్సి ఉంది.