గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చాన్నాళ్ల తరువాత సోలో సినిమా..!

Mon May 03 2021 20:00:01 GMT+0530 (IST)

Solo movie after channels in Geeta Arts banner ..!

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్.. గత ఐదు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ బ్యానర్ గా నిలిచింది. ఎక్కువ శాతం మెగా హీరోలతోనే సినిమాలు తీసే ఈ సంస్థ.. కొన్ని హిందీ తమిళ కన్నడ చిత్రాలను కూడా నిర్మించింది. ఈ క్రమంలో దీనికి అనుబంధ సంస్థగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ని ఏర్పాటు చేసి ఇతర హీరోలతో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సోలో సినిమా చేసి చాలా ఏళ్లయింది.



2016లో అల్లు శిరీష్ తో చేసిన 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. 'ధ్రువ' 'అల వైకుంఠపురంలో' సినిమాలు చేశారు కానీ.. వేరే నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో నిర్మించారు. గీతా వారు ప్రస్తుతం చేస్తున్న 'జెర్సీ' హిందీ రీమేక్ సినిమా నిర్మాణంలో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు - అమన్ గిల్ లకు కూడా వాటా ఉంది. ఈ నేపథ్యంలో చాన్నాళ్ల తరువాత గీతా ఆర్ట్స్ పతాకంపై సోలోగా ఓ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందని ఈ మధ్య వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తారని అంటున్నారు. ఇప్పటికే 'గజిని 2' అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించినట్లు టాక్. అయితే ఆల్రెడీ కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ వారితో కలిసి గీతా ఆర్ట్స్ వారు నిర్మించనున్నారు. మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ లలో ముందుగా ఏ చిత్రాన్ని ప్రారంభిస్తారో చూడాలి.