Begin typing your search above and press return to search.

ద‌స‌రాకి లేదు.. క్రిస్మ‌స్ కి అయినా వ‌స్తావా సోలో బెదరూ?

By:  Tupaki Desk   |   20 Oct 2020 8:10 AM GMT
ద‌స‌రాకి లేదు.. క్రిస్మ‌స్ కి అయినా వ‌స్తావా సోలో బెదరూ?
X
బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాల‌న్న త‌ప‌న‌తో ప‌ని చేస్తున్నాడు సాయి తేజ్. చిత్ర‌ల‌హ‌రి- ప్ర‌తిరోజు పండ‌గే సినిమాలతో స‌క్సెస్ రూట్ లోకి కంబ్యాక్ అయిన సాయి తేజ్ ఇప్పుడు `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` అనే సినిమాలో న‌టిస్తున్నారు. సుబ్బు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి ప్ర‌మోష‌న్ ప‌రంగానూ ఒక అడుగు ముందే ఉన్నారు.

అయితే ఇన్నాళ్లు థియేట్రిక‌ల్ రిలీజ్ అంటూ వేచి చూశారు. చివ‌రికి ఓటీటీలో వ‌దిలేస్తున్నార‌ని ప్ర‌చార‌మైపోయింది. కానీ దేనిపైనా ఇప్ప‌టికీ క్లారిటీ లేన‌ట్టే క‌నిపిస్తోంది. సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ రిలీజ్ పై అస్స‌లు క్లారిటీ లేదు అంటూ సుప్రీం హీరో అభిమానులు గ‌రంగ‌రంగానే ఉన్నారు. వ‌రుస హిట్ల‌తో మాంచి దూకుడు మీదున్న త‌మ ఫేవ‌రెట్ హీరో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఆశించారు. కానీ లాక్ డౌన్ పుణ్య‌మా అని ప్ర‌తిదీ రివ‌ర్స్ అయ్యింది. ఏదీ క్లారిటీ లేకుండా అయ్యింది.

చాలా కాలంగా హీరో గారు థియేట‌ర్స్ లో సినిమా రిలీజ్ చేయాల్సిందే అని ప‌ట్టుబడుతున్నార‌ట‌. అయితే అలా చేస్తే తాము కొనుకున్న పైస‌ల‌కి అది వ‌ర్క్ అవుట్ అవ్వ‌దు అని జీ5 స్ట్రీమింగ్ వాళ్లు ఆలోచిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. ఎంత లేద‌నుకున్నా ఈ సినిమా ప‌నుల‌న్నీ నెలాఖర‌కు అయ్యే అవ‌కాశం ఉంది. మ‌రి తేజ్ కి క‌లిసి వ‌చ్చి డిసెంబ‌ర్ లో ఈ సినిమాను విడుద‌ల చేస్తారేమో చూడాలి. స‌మ్మ‌ర్ కుద‌ర‌లేదు.. ద‌స‌రా దీపావ‌ళి ఆశ‌లేదు. క‌నీసం క్రిస్మ‌స్ కి అయినా వ‌స్తావా బెద‌రూ?