మిడిల్ ఫింగర్ చూపించేసింది!

Mon Jun 27 2022 08:00:01 GMT+0530 (IST)

Sobitha Dhulipala Reaction

టాలీవుడ్ హీరో నాగచైతన్య ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం నాగచైతన్య - సమంత విడాకులు ప్రకటించి షాకిచ్చారు. దీనిపై సర్వత్రా హాట్ చర్చ జరిగింది. ఆ తరువాత ఈ ఇష్యూని  మర్చి పోయి చై సామ్ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ కెరీర్ పై దృష్టి పెట్టారు. ఇదిలా వుంటే ఇటీవల నాగచైతన్య - హీరోయిన్ శోభితా దూళిపాళతో డేటింగ్ లో వున్నారని బాలీవుడ్ మీడియా ప్రచారం చేయడం మొదలు పెట్టింది.దీనిపై టాలీవుడ్ లోనూ రక రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఇద్దరు ఎలా కలిశారు? ..కలిసి ఒక్క సినిమా కూడా చేయని ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఎలా మొదలైంది? డేటింగ్ వరకు ఎలా వెళ్లింది? అంటూ టాలీవుడ్ వర్గాల్లో హాట్ చర్చ మొదలైంది. రక రకాల కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఈ డేటింగ్ వార్తలని సమంతనే క్రియేట్ చేయించిందంటూ నాగచైతన్య ఫ్యాన్స్ నెట్టింట సామ్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

నాగచైతన్య డేటింగ్ వార్తలని లైట్ తీసుకుంటే చై ఫ్యాన్స్ మాత్రం ఇదంతా సామ్ పీఆర్ టీమ్ పనే అంటూ టార్గెట్ చేశారు. దీంతో ఫ్యాన్స్  ట్రోలింగ్ పై సమంత సీరియస్ గా స్పందించింది. ఓ అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే.. కానీ అబ్బాయిపై పుకార్లు వస్తే అమ్మాయే చేయించింది అంటూ ప్రచారం చేస్తారు.. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు.. మేము ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయాము. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీ పని మీద మీ కుటుంబాల మీద ఏకాగ్రత పెట్టండి` అంటూ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించింది.

ఈ వార్తలని సమంత ఫ్యాన్స్ కూడా ఖండించారు. అయితే డేటింగ్ వార్తల్లో ప్రధానంగా నిలిచిన శోభిత ధూళిపాల మాత్రం సైలెంట్ గా వుండిపోయింది. తెలుగులో `గూఢచారి` మేజర్ చిత్రాలతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న శోభిత తాజాగా తనపై వస్తున్న డేటింగ్ రూమర్ లపై ఘాటుగానే స్పందించినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ వీడియోలో తాజా రూమర్ లపై సింబాలిక్ గా శోభిత ఫింగర్ చూపిండం ఇప్పడు వైరల్ గా మారింది.