బోల్డ్ లుక్ తో కిల్ చేస్తున్న తెనాలమ్మాయ్!

Sun May 09 2021 05:00:01 GMT+0530 (IST)

Sobhita Dhulipala Latest Photo

తెలుగమ్మాయి శోభిత ధూలిపాళ పరిచయం అవసరం లేదు. అడివి శేష్  గూఢచారి చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం మేజర్ చిత్రంలోనూ కీలక పాత్రలో నటిస్తోంది. శేష్ ఈ చిత్రంలో వైమానిక దళ అధికారి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో నటిస్తుండగానే శోభితకు హాలీవుడ్ లో ఆఫర్ దక్కింది. స్లమ్ డాగ్ మిలయనీర్ ఫేం దేవ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మంకీమ్యాన్ అనే టైటిల్ ని నిర్ణయించారు. ఈ మూవీ కోసం ఆడిషన్స్ కి వెళ్లింది శోభిత.

అలాగే శోభిత పలు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ బిజీగా ఉంది. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం సహా మలయాళం.. తమిళంలోనూ అవకాశాలు అందుకుంటోంది. హిందీ చిత్రం మేడ్ ఇన్ హెవెన్ రెండవ సీజన్ లోనూ నటిస్తోంది. దేవ్ పటేల్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న మంకీ మ్యాన్ తో ఈ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ లో అడుగు పెడుతోంది.

``నేను దాదాపు ఐదు సంవత్సరాల క్రితం మంకీ మ్యాన్ కోసం ఆడిషన్ చేశాను. దేవ్ తో స్క్రీన్ టెస్ట్ కోసం కొద్ది రోజుల్లోనే నాకు కాల్ వచ్చింది. నాకు ఇంకా గుర్తుంది.. అది నా మొదటి చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016) తో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు బయలుదేరిన రోజు. ఇన్ని సంవత్సరాల తరువాత  చలన చిత్ర ప్రయాణంలో చాలా మలుపుల తరువాత మేము ఒకరితో ఒకరు కలిసి ఉన్నట్లు అనిపిస్తోంది. ఇందులో నా పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది`` అని శోభిత తెలిపారు.

గత సంవత్సరం మహమ్మారి సమయంలో `మంకీ మ్యాన్` కోసం నాలుగు నెలల పాటు ఇండోనేషియాలో శోభితపై చిత్రీకరణ సాగించారు. తొలి హాలీవుడ్ సినిమా పై శోభిత ఎంతో ఆసక్తిగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాల్లో శోభిత అన్ లిమిటెడ్ ట్రీట్ గురించి చెప్పాల్సినదేమీ లేదు. రెగ్యులర్ ఫోటోషూట్లతో ఈ తెనాలి బ్యూటీ (2013 మిస్ ఎర్త్ ఇండియా) యువతరంలోకి వైరల్ గా దూసుకెళుతోంది.