సో సాయి తేజ్ మళ్లీ సోలోగా పోరాడాల్సిందేనా..?

Sun Jan 24 2021 05:00:02 GMT+0530 (IST)

So should Sai Tej fight solo again

మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది చివర్లో 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో పలకరించాడు. ఈ సినిమా సో సో గా ఉండటంతో ఆ తరువాత వచ్చే సినిమా అయినా పెద్ద హిట్ అవ్వాలని మెగా ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో సాయి తేజ్ 'ప్రస్థానం' దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాడు. పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. అయితే సాయి తేజ్ కి పబ్లిక్ సర్వీస్ - దేశ సేవ - పాలిటిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ కలిసొస్తాయో లేదో అని మెగా ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.సాయితేజ్ - దేవకట్టా కాంబోలో వస్తున్న సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందని సమాచారం. అలానే ఇందులో తేజ్ ఐఏఎస్ గా కనిపిస్తున్నాడని టాక్ నడుస్తోంది. అంటే క్యారక్టర్ ని బట్టి హీరో నీట్ గా టక్ చేసుకుని ఫార్మల్స్ లో కనిపించే అవకాశం ఉంది. ఇంతకముందు సాయి తేజ్ అలాంటి లుక్ లో కనిపించిన 'జవాన్' 'ఇంటెలిజెంట్' సినిమాలు ఘోర పరాజయం చెందాయి. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న నివేతా పేతురాజ్ కి సినిమాని ఆడియెన్స్ దాకా తీసుకెళ్లేంత స్టామీనా లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో సాయితేజ్ మళ్లీ సోలోగా పోరాడాల్సిందే అని ఫిలిం సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నాడు తేజ్.