Begin typing your search above and press return to search.

#HBD అర్జునా.. బ‌న్నికి స్నేహ శుభాకాంక్ష‌లు

By:  Tupaki Desk   |   8 April 2021 4:30 AM GMT
#HBD అర్జునా.. బ‌న్నికి స్నేహ శుభాకాంక్ష‌లు
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం `పుష్ప` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల‌ షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చి మాల్దీవుల్లో చిన్న‌పాటి సెల‌వును ఆస్వాధించారు బ‌న్ని. ఈ ట్రిప్ లో స్నేహా రెడ్డి- అయాన్ - అర్హ స‌హా స్నేహితుల గ్యాంగ్ సెల‌బ్రేష‌న్స్ ‌కు సంబంధించిన ఫోటోలు ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి.

ప్ర‌స్తుతం బ‌న్ని ట్రిప్ ముగించుకుని హైద‌రాబాద్ లో ఉన్నారు. ఏప్రిల్ 8 బ‌న్ని పుట్టినరోజు సందర్భంగా ఈ బుధ‌వారం సాయంత్ర‌మే పుష్ప‌ టీజర్ లాంచ్ చేయ‌గా అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అయ్యింది. యాక్ష‌న్ ప్యాక్డ్ మాస్ ట్రీట్ పై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

తొలిగా బ‌న్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ భార్య స్నేహ మాల్దీవుల సెల‌బ్రేష‌న్ కి సంబంధించి ఒక త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేశారు. . బన్ని- స్నేహ జంట‌ ఈ ఫోటోలో చాలా అందంగా కనిపిస్తున్నారు. స్నేహ దీనికి `#హ్యాపీ బర్త్‌డే అర్జునా` అనే బ్యూటిఫుల్ క్యాప్షన్ ఇచ్చారు. ప్ర‌స్తుతం బ‌న్ని అభిమానుల్లో ల‌వ్ క‌పుల్ ఫోటో వైర‌ల్ గా మారింది. ఇప్ప‌టికే #HBD బ‌న్ని డీపీ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అభిమానులు అత‌డికి సోష‌ల్ మీడియాల్లో విషెస్ హోరెత్తిస్తున్నారు.

అల్లు అర్జున్ న‌టిస్తున్న‌ `పుష్ప` ఇంట్రడక్షన్ టీజర్ 300 కె లైక్ ‌లతో 30ల‌క్ష‌ల (3 మిలియన్ల) వీక్షణలతో అంత‌ర్జాలంలో దూసుకెళుతోంది. త‌దుప‌రి పూర్తి టీజ‌ర్ స‌హా ట్రైల‌ర్ తో పుష్పపై మ‌రింత హైప్ పెరుగుతుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు.