Begin typing your search above and press return to search.

మహేష్‌.. బన్నీల కంటే ముందే రౌడీస్టార్‌

By:  Tupaki Desk   |   26 Feb 2020 4:00 AM GMT
మహేష్‌.. బన్నీల కంటే ముందే రౌడీస్టార్‌
X
విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ అర్జున్‌ రెడ్డి.. గీత గోవిందం చిత్రాలతో ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో కూడా ఆయన స్టార్‌ డం అమాంతం పెరిగింది. ఆయన్ను మిలియన్స్‌ లో ఫాలో అవ్వడం మొదలైంది. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా డియర్‌ కామ్రేడ్‌ చిత్రంతో అక్కడ ఇక్కడ అంటూ పబ్లిసిటీ చేశాడు. ఆ సినిమా ఫలితం బెడిసి కొట్టినా కూడా పబ్లిసిటీ అయితే బాగానే దక్కింది. ఒరిజినల్‌ కబీర్‌ సింగ్‌ విజయ్‌ దేవరకొండ కనుక బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఈయన్ను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు.

ప్రస్తుతం సెలబ్రెటీలు ఎక్కువగా యాక్టివ్‌ గా ఉంటున్న ఇన్‌ స్టాగ్రామ్‌ లో విజయ్‌ దేవరకొండ కూడా తరుచు పోస్ట్‌ లు పెడుతూ ఉంటాడు. తాజాగా ఈ రౌడీస్టార్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య ఏకంగా ఆ మిలియన్స్‌ కు చేరింది. ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాలో ఏ హీరోకు ఈ ఘనత దక్కలేదు. అల్లు అర్జున్‌ కు సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ ఎక్కువగా ఉంటారని టాక్‌. కాని ఆయన్ను కూడా దాటేసి రౌడీ స్టార్‌ సౌత్‌ సోషల్‌ మీడియా స్టార్‌ గా నిలిచాడు. అల్లు అర్జున్.. మహేష్ బాబు లకంటే ముందే ఆరు మిలియన్ ల ఫాలోవర్స్ ను విజయ్ దేవరకొండ దక్కించుకున్నాడు.

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఇటీవలే వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా డిజాస్టర్‌ అయ్యింది. ఇక ప్రస్తుతం పూరి దర్శకత్వంలో లైగర్‌ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఆ సినిమాను విడుదల చేయబోతున్నారు. అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణ వ్యవహారాల్లో కరణ్‌ జోహార్‌ కూడా భాగస్వామిగా ఉండటంతో అక్కడ కూడా సినిమాకు బజ్‌ ఉంది. ఈ సినిమా అక్కడ హిట్‌ అయితే మనోడి ఫాలోవర్స్‌ సంఖ్య 10 మిలియన్‌ లకు కూడా పెరిగే ఛాన్స్‌ ఉందని ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు.