శీకాకుళం ఫోక్ సాంగ్ దుమారమే...

Fri Jan 17 2020 16:22:43 GMT+0530 (IST)

Sittharala Sirapadu Lyrical Video From Ala Vaikunthapurramuloo

అల వైకుంఠపురములో ఆల్బమ్ ఎస్.ఎస్.థమన్ కెరీర్ బెస్ట్ అనడంలో సందేహం లేదు. ఈ సినిమా నుంచి రెండు మూడు చార్ట్ బస్టర్ సాంగ్స్ అతడి ఇమేజ్ ను మరింతగా పెంచాయనడంలో అతిశయోక్తి లేదు. రకరకాల విమర్శల్ని ఎదుర్కొంటున్న థమన్ ఎట్టకేలకు రొటీన్ కి భిన్నంగా.. క్యాచీగా ఉండే మ్యాజిక్ తో దూసుకొచ్చాడు. స్టార్ రైటర్ల సాహిత్యానికి తగ్గట్టుగా థమన్ బాణీలు పెద్ద అస్సెట్ అయ్యాయి. ఇది కేవలం థమన్ కెరీర్ కే కాకుండా బన్నీ కెరీర్ లోనూ బెస్ట్  మ్యూజికల్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా నుంచి.. సామరజవరగమన.. రాములో రాములా పాటలు యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచిన సంగతి తెలిసిందే. సంగీత ప్రియుల్ని ఈ రెండు పాటలు ఎంతగానో అలరించాయి. ఈ మూవీలోని సిత్తరాల సిరపడు పాటకు విజువల్ గా మంచి పేరొచ్చింది. పక్కా శ్రీకాకుళం లోకల్ స్లాంగ్ లో జానపదం శైలిలో సాగే  పాటతో ఒక యాక్షన్ సీక్వెన్సును తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. ఆ ఫైట్ సీన్ బన్ని ఫ్యాన్స్ కు.. ప్రేక్షకాభిమానులకు విపరీతంగా నచ్చింది. దీంతో ఈ ఫైట్ సీక్వెన్సులో వాడిన సిత్తరాల సిరపడు సాంగ్ లిరికల్ వీడియోని శుక్రవారం విడుదల చేశారు.

థమన్ ట్యూన్ కు తగ్గట్టుగా గాయకులు సూరన్న.. సాకేత్ చక్కగా రాగయుక్తంగా ఆలపించారు. మాస్ లో జోష్ నింపేలా సాహిత్యం మైమరిపించింది. పాట ఆరంభంలో స్లోఫేస్ తో ఉన్నా... డెప్త్ లోకి వెళ్లే కొద్ది హృదయాల్ని టచ్ చేసేలా కనెక్టింగ్ గా ఉంది. ఫోక్ గీతాలను ఇష్టపడే  శ్రోతలకు తొందరగా కనెక్ట్ అయ్యే గీతమిది. డిజిటల్ మీడియాలోకి వచ్చిన ఈ ఫోక్ సాంగ్ అక్కడ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మాటల మాయావికి భాషపై ఉన్న పట్టు.. బెస్ట్ సాంగ్స్ తీసుకునేందుకు ఉపయోగపడిందని ఈ చిత్రంలో పాటలు క్లియర్ కట్ గా చెప్పాయి.