గ్లాస్ మ్యూజియంలో సితార ఫొటో వైరల్

Mon Jun 27 2022 14:00:43 GMT+0530 (IST)

Sithara photo goes viral at the Glass Museum

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ కి మాత్రమే కొంచెం కూడా దూరంగా ఉండడానికి ఇష్టపడడు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం కొన్నిసార్లు షూటింగ్ స్పాట్ లోకి పిల్లల్ని కూడా రమ్మని చెబుతూ ఉంటాడు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తరహాలోనే మహేష్ బాబు కూడా తన పిల్లలకు ప్రతి విషయంలో కూడా చాలా బాధ్యతగా కొనసాగుతూ ముందుకు సాగుతున్నారు అనే చెప్పాలి.ఇక సినిమాల షూటింగ్స్ ఏమాత్రం కంప్లీట్ అయినా కూడా ఫ్యామిలీతో కలిసి సరదాగా విదేశాలకు కూడా వెళుతూ ఉంటాడు. ఇక రీసెంట్ గా తన కుటుంబ సభ్యులతో అమెరికా వెళ్ళిన మహేష్ బాబు అక్కడ కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చుట్టేస్తున్నాడు. ఇక ఆయన కూతురు సితార కూడా తండ్రితో కలిసి చాలా హ్యాపీగా ఈ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది.

సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమెకు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఇక రీసెంట్ గా న్యూయార్క్ లోని ప్రత్యేకమైన గ్లాస్ మ్యూజియంకు కూడా వెళ్లిన సితార ఘట్టమనేని అక్కడ అందమైన స్టిల్స్ తో కొన్ని ప్రత్యేకంగా ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

సితార రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అందులో ప్రత్యేకంగా పెన్నీ సాంగ్ లో కనిపించి ఎంతగానో హైలెట్ అయ్యింది. ఆమె మంచి నటి అయ్యే అవకాశమున్నట్లు అభిమానులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు మాత్రం వచ్చే ఏడాది మొదట్లోనే స్టార్ట్ కానుంది.