శ్యామ్ సింఘరాయ్ సితారలో కాదా? ఇది నిజమా?

Sat Oct 17 2020 11:30:26 GMT+0530 (IST)

Isn't Shyam Singharai not with sitara? Is this true?

నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో షెడ్యూల్స్ ని బిజీగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. లాక్ డౌన్ అనంతరం ఈ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు శరవేగంగా చిత్రీకరణలు పూర్తి చేయాలన్నది అతడి ప్లాన్. తాజా ప్రాజెక్ట్ `శ్యామ్ సింఘరాయ్` తన కెరీర్ లో సంథింగ్ స్పెషల్ గా ఉండాలన్నది నాని ఆలోచన అట. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు సితారా ఎంటర్ టైన్మెంట్స్ సన్నాహకాల్లో ఉంది. టాక్సీవాలా ఫేం రాహుల్ సంక్రిత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజా మ్యాటర్ ఏమంటే.. సితారా ఎంటర్ టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగిందని ఒకటే ఫిలింనగర్ లో ప్రచారం సాగుతోంది. సితార స్థానంలో మరో నిర్మాత వెంకట్ బోయనాపల్లి టీమ్ లో చేరారని.. ఆయన ఇప్పటికే అనేక సినిమాలకు పనిచేశారని ప్రచారమవుతోంది.

అయితే ఇది నిజమా? `జెర్సీ` (సితార) నిర్మాతలతో నాని పని చేయడం లేదా? అంటే.. ఇవన్నీ కేవలం ఊహాగానాలు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గాసిప్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ పుకారు గురించి సీతారా ఎంటర్ టైన్మెంట్స్ అధినేత వంశీ వివరణ ఇస్తారా లేదా అన్నది చూడాలి. నాని నటించిన వి ఇటీవలే ఓటీటీలో రిలీజై మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే.