శౌర్య చేతికి చైతూ సినిమా!

Thu Sep 19 2019 13:15:56 GMT+0530 (IST)

Sithara Entertainments Movie With Naga Shourya

కొన్ని కథలు కొందరు హీరోల దగ్గరికి వెళ్లి ఫైనల్ గా ఓ హీరో దగ్గర ఆగడం కామనే. కొన్ని సార్లు డేట్స్ కుదరక కొందరికి కథ నచ్చక కథల మార్పిడి జరుగుతుంది. లేటెస్ట్ గా శౌర్య చేతికి కూడా ఇలాంటి కథే వచ్చింది. లక్ష్మీ సౌజన్య అనే అమ్మాయి ఆ మధ్య నాగ చైతన్య కి ఓ కథ వినిపించింది. చైతూ కి కూడా కథ నచ్చిందనే ఆమెతో సినిమా చేస్తున్నాడని వార్త బయటికొచ్చింది. హీరోయిన్ గా రకుల్ కూడా ఫిక్స్ అన్నారు. కట్ చేస్తే సినిమా ట్రాక్ తప్పింది.ఇప్పుడు సౌజన్య అదే కథను శౌర్యతో చేయబోతోందని అంటున్నారు. లేటెస్ట్ గా సితార ఎంటర్టైన్ మెంట్స్ లో శౌర్య - సౌజన్య సినిమాను అనౌన్స్ చేశారు. నిజానికి సితార వాళ్ళు చైతూ కాంబినేషన్ లో ఈ సినిమాను చేయాలని చూసారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు అదే సినిమాను శౌర్య తో నిర్మిస్తున్నారు. చైతూ పక్కకి తప్పుకున్నా సౌజన్యను ఇంత వరకూ వెయిట్ చేయించి ఎట్టకేలకు ఆమెకు అవకాశం ఇచ్చి సినిమాను చేస్తున్నారు.

ప్రస్థుతాయికైతే ఈ సినిమాలో శౌర్య మినహా నటించే కాస్టింగ్ గురించి డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అక్టోబర్ నుండి షూట్ స్టార్ట్ చేసి వచ్చే వేసవికి సినిమాను రిలీస్ చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలియనున్నాయి.