వీడియో: నాన్న పాటకు సితార పాప డ్యాన్స్

Tue Aug 13 2019 15:13:18 GMT+0530 (IST)

Sithara Dance To Mahesh Babu Movie Song

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ యమా డీసెంట్.. హంబుల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్దగా హంగామా జరగదు. కానీ మహేష్ గారాలపట్టి సితార అలా కాదు. అల్లరంతా సితార దగ్గరే ఉంటుంది.  సితార చేసే అల్లరి.. సితార ఆటపాటలకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడూ మహేష్ లేదా నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అందుకే సితార పాప సోషల్ మీడియాలో చాలా పాపులర్.తాజాగా నమ్రత మరోసారి సితార పాపకు సంబంధించిన ఒక డ్యాన్స్ వీడియో ను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేశారు.  ఈ వీడియోకు "నువ్వెంత ముద్దుస్తున్నావో.. రోజు నా పెదవిపై నిలిచే చిరునవ్వుకు నువ్వే కారణం" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.  వీడియోలో చిట్టి సితార 'మహర్షి' సినిమా లోని 'పాల పిట్ట' పాటకు ఎంతో అందంగా.. సూపర్ గ్రేస్ తో డ్యాన్స్ చేసింది.  మహేష్ ఎక్స్ ప్రెషన్లను కూడా అలాగే అనుకరించడం విశేషం.  ఈ వీడియో చూసి ముచ్చట పడిన మహేష్ అభిమానులు మహేష్ కంటే డ్యాన్స్ బాగా చేస్తోందని సితారకు కితాబిచ్చారు.

ఈ వీడియోకు మూడు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.  క్యూట్ అని.. స్వీట్ అని.. ప్రెట్టి గర్ల్ అని సితార పాపపై నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తూ ఉన్నారు. ఆలస్యం ఎందుకు.. ఒకసారి మీరు కూడా సితార పాప క్యూట్ డ్యాన్స్ పై ఒక లుక్కేయండి.

For Video Click Here