ఘట్టమనేని వారసురాలా.. మజాకానా!

Thu Nov 25 2021 14:29:26 GMT+0530 (IST)

Sitara Shared dance video In Instagram

సూపర్ స్టార్ మహేష్-నమ్రతశిరోద్కర్ ల గారాట పట్టీ సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం తనవైన క్యూట్ వీడియోలు ఫోటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మహేష్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ని నిర్వహిస్తోందంటే సితార లో బ్రిలియన్సీ చురుకైన వ్యక్తిత్వాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు.తాజాగా సితార.. స్టార్ కొరియోగ్రాఫర్ అనీ మాష్టర్ తో డాన్సులు చేయడంలోనూ పోటీ పడింది. సితార డాన్సు చూస్తే భవిష్యత్ లో పెద్ద డాన్సర్ గా ఎదగడం ఖాయమనిపిస్తోంది. ఓ వెస్ట్రన్ మ్యూజిక్ కి సితార స్టెప్పులేసి ఆకట్టుకుంది.

అనీ మాష్టర్ డాన్స్ చేస్తుంటే తనను చూసి సితార కూడా అవే స్టెప్పుల్ని దించేసి ఆశ్చర్యపరిచింది. అంత అద్భుతంగా సితార డాన్స్ చేసింది. వామ్మోవ్..! సీతా పాప ఏక సంధాగ్రాహి!! అంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. ఘట్టమనేని వారసురాలిగా సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం సంచలనాలే. స్టార్ రేంజ్ కు చేరుకుంటుందనడానికి ఈ ప్రతిభ ఉదహరణగా చెప్పొచ్చు. తల్లిదండ్రులు..తాతయ్య నుంచి యాక్టింగ్ సహజంగానే అబ్బేస్తోంది.

ఇంకా ఇతర ట్యాలెంట్ ని ఒడిసిపట్టుకుంటే సితారకున్న ఎంకరేజ్ మెంట్ కి గొప్ప స్థానంలో ఉంటుంది. తల్లిదండ్రులు ఆ కోణంలో ప్రోత్సహించడానికి ఎంత మాత్రం వెనుకడుగు వేయరు. ఇప్పటికే మహష్ ఆ విషయాన్ని క్లియర్ గా చెప్పేసారు. సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉంటే కచ్చితంగా ఎంకరేజ్ చేస్తానని ప్రామిస్ చేసారు.

తల్లి నమ్రత మోడలింగ్ రంగం నుంచే వచ్చారు కాబట్టి తను కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తారు. మోడలింగ్ నుంచి వచ్చి పెద్ద స్టార్ అవ్వాలనుకున్నారు నమ్రత. కానీ మహేష్ తో ప్రేమ..పెళ్లి తర్వాత సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసారు. ఆ రకంగా తన కల కలగానే మిగిలిపోయింది.

కనీసం కుమార్తెను అయినా ఆ స్థానానికి తీసుకెళ్లి చూసుకోవాలని ఆరాటపడుతున్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. మరి ఆ దిశగా సితార అడుగుల వేస్తుందేమో చూడాలి. ఇప్పటికే కుమారుడు గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా `వన్` సినిమాతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఓ వాణిజ్య ప్రకటనలో మహేష్ కుటుంబం అంతా కలిసి నటించారు. ప్రస్తుతానికి గౌతమ్ - సితార స్టడీస్ పైనే పేరెంట్ శ్రద్ధ. కెరీర్ గురించి మరీ అంత సీరియస్ నెస్ లేదు. మునుముందు ఇది మారుతుందనే ఘట్టమనేని అభిమానులు ఆశిస్తున్నారు.