Begin typing your search above and press return to search.

వీడియో: క‌్యూట్ సీతా పాప ఆ ఫ్రెండ్ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   18 Jun 2020 5:30 AM GMT
వీడియో: క‌్యూట్ సీతా పాప ఆ ఫ్రెండ్ ఎవ‌రు?
X
ఇమ్మిటేష‌న్ (అనుక‌ర‌ణ‌) అనేది అద్భుత‌మైన క‌ళ‌. టిక్ టాక్ లు .. సోష‌ల్ మీడియాల పుణ్య‌మా అని ప్ర‌తి ఒక్క‌రూ ఈ క‌ళ‌లో ఆరితేరిపోతున్నారు. స్టార్ల‌ను ఇమ్మిటేట్ చేస్తూ ఎక్క‌డో మారుమూల ప‌ల్లెల్లో ఉన్న ప‌ల్లె కోకిల‌లు సైతం అబ్బుర‌ప‌రిచే విన్యాసాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. టిక్ టాక్ ఒక ర‌కంగా అంత‌ర్లీనంగా దాగి ఉన్న ప్ర‌జ‌ల క‌ళ‌ని బ‌య‌టికి తీసింద‌నే చెప్పొచ్చు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కుమార్తె .. క్యూట్ సితార ఘ‌ట్ట‌మ‌నేని సోష‌ల్ మీడియాల్లో ఎలాంటి క్యూట్ వేషాలు వేస్తుందో తెలిసిందేగా.. అక్క‌డ రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌దే. తాజాగా సితార ఇన్ స్టా లో పోస్ట్ చేసిన వీడియో ఫ్యాన్స్ లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

అస‌లింత‌కీ ఈ వీడియోలో క‌నిపిస్తున్న ఆ క్యూటీ ఎవ‌రు? అంటే దానిపేరు తాపిర్. ఏదో జూలో ఇలా బంధికానా అయ్యింది. అచ్చం తాపిర్ లానే క్యూట్ గా సీతా పాప ఎలా న‌ములుతుందో చూశారుగా! అది ఆహారాన్ని బాగా న‌మిలి తింటోంది. అచ్చం అలానే క్యూట్ గా చేసి చూపిస్తోంది సితార‌. ఇలాంటి ల‌వ్ లీ.. క్యూటీ వేషాలు వేయ‌డంలో సీతా పాప త‌ర్వాత‌నే. ఇంత‌కుముందు న‌మ్ర‌త ఎన్నో వీడియోల్ని షేర్ చేస్తే వాటిని ఫ్యాన్స్ అంతే జోరుగా వైర‌ల్ చేశారు. ఇన్ స్టాలో సితార ఘ‌ట్ట‌మ‌నేని ఫాలోయింగ్ అమాంతం పెరుగుతోందంటే ఇందుకేగా!