`సీతారామం` మరో ఎమోషనల్ సీన్ ఇదుగో!

Fri Sep 23 2022 18:00:55 GMT+0530 (India Standard Time)

Sita Ramam Deleted Scene

యంగ్ టాలెంటెడ్ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఎపిక్ లవ్ స్టోరీ `సీతారామం`. `ఓ యుద్దంతో రాసిన ప్రేమకథ` అంటూ హను రాఘవపూడి దర్శకత్వంలో స్వస్న సినిమా బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ ఇది. మృణాల్ ఠాకూల్ హీరోయిన్ గా రష్మకి మందన్న కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ఆగస్టు లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.హృద్యమైన  ప్రేమ కావ్యంగా రూపొందిన ఈ సినిమా ప్రతీ ఒక్కరి హృదయాల్ని స్పృశించి ప్రశంసలు అందుకుంది. అనాధ అయిన లెఫ్టినెంట్ రామ్ కోసం ఏకంగా ప్రిన్సెస్ నూర్జహాన్ రావడం.. తనని సీతగా పరిచయం చేసుకోవడం. ఆతరువాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం వంటి అందమైన కథతో అత్యద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన పీరియాడికల్ ఫిక్షనల్ ఎపిక్ డ్రామాగా ఆకట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకుర్ ల అత్యుత్తమ నటన ప్రేక్షకుల్ని సరికొత్త అనుభూతికి సీతా రామ్ ల కథతో ట్రావెల్ అవుతున్న అనుభూతికి లోనయ్యేలా చేసింది. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టిన ఈ మూవీ ఇటీవలే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ మొదలై అక్కడ కూడా ఓటీటీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ శుక్రవారం ఈ మూవీకి సంబంధించిన ఓ ఎమోషనల్ సీన్ న ఇవిడుదల చేశారు. కీలక ఘట్టంలో టీమ్ తో వెళ్లిన దుల్కర్ సుమంత్ పాకిస్తాన్ సైన్యానికి బంధీలుగా దొరుకుతారు.

ఆ క్రమంలో వారిలో ఒకరికి మాత్రమే విముక్తిని ప్రసాదిస్తామని తెలిసిన సమయంలో వచ్చే సీన్ ని సినిమాలో నిడివి కారణంగా తొలగించారు. అయితే అదే సీన్ ని తాజాగా శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఫుట్ బాల్ ఆట సమయంలో దుల్కర్ సుమంత్ ల వచ్చే భావోద్వేగ ఘట్టానికి సంబంధించిన ఈ వీడియో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల్ని మరింత ఎమోషన్ కు గురి చేసేలా వుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.