సీతారామం వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్కలు

Fri Aug 12 2022 20:37:06 GMT+0530 (IST)

Sita Ramam Collects 40 Crore plus Gross Worldwide In First Week

దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి - స్వప్న దత్ కాంబినేషన్ మూవీ `సీతా రామం` మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని  క్లాసికల్ లవ్ స్టోరీ సీతా రామం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన నోట్ తో మొదటి వారాన్ని ముగించింది.  ఫస్ట్ వీకెండ్ రన్ లో సంచలనం సృష్టించిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కొంచెం కూడా డ్రాప్ కాకుండా వసూళ్లను సాగించడం ఆసక్తికరం. మల్టీప్లెక్స్ లు ఎ సెంటర్లతో పాటు బి- సి సెంటర్లలో కూడా ఈ సినిమా చాలా మంచి వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఇది అన్ స్టాపబుల్..  మౌత్ టాక్ సూపర్ పాజిటివ్ గా ఉండటంతో వారం రోజులుగా పోటీకి ఎందరు వస్తున్నా ఆందోళన లేదని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

యుఎస్ బాక్స్ ఆఫీస్ కూడా మొదటి వారంలో అద్భుతమైన సంఖ్యలను నమోదు చేసింది.  సినిమా మొత్తం 850K డాలర్లకు పైగా వసూలు చేసింది.  ఈ వారాంతంలో సినిమా వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.

ఎపిక్ లవ్ సాగా సీతారామంతో ప్రేక్షకులు విమర్శకులు ప్రేమలో పడుతున్నారు.  యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథ లో భావోద్వేగం ప్రేక్షకులకు యూనిక్ అనుభవాన్ని అందిస్తోంది. అందుకే రిపీటెడ్ ఆడియెన్ వస్తున్నారని చిత్రబృందం చెబుతోంది.  

ముఖ్యంగా నాయకానాయికలు  దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ నట ప్రదర్శన ... హను రాఘవపూడి అద్భుతమైన రచనా నైపుణ్యం.. దర్శకత్వ ప్రతిభ.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం.. పి.ఎస్.వినోద్ అద్భుతమైన విజువల్స్ .. స్వప్న సినిమా - వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలు కలిసి సినిమాను ప్రేక్షక హృదయాలలో నిలిచిపోయే క్లాసిక్ గా నిలిపాయి. ఇటీవలి కాలంలో అద్భుతమైన రివ్యూలతో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇదేనన్న చర్చా సాగుతోంది.