సీత బిజినెస్ క్లోజ్.. భలే డిమాండ్ ఉందే!

Mon Apr 15 2019 11:56:57 GMT+0530 (IST)

Sita Movie Business Closed

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కాజల్ హీరో హీరోయిన్లుగా సీనియర్ దర్శకుడు తేజ 'సీత' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయింది.  హీరో హీరోయిన్ల డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  అమాయకుడిగా బెల్లంకొండ శ్రీనివాస్.. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్ కాంబినేషన్ కూడా కొత్తగా అనిపించింది.ప్రోమోస్ ఆసక్తికరంగా ఉంటే ఆటోమేటిక్ గా ఆ ఇంపాక్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ పై పడుతుంది కదా.  అలాగే ఈ సినిమాకు బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. బిజినెస్ మ్యాన్ కమ్ ప్రొడ్యూసర్ అయిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు చేజిక్కించుకున్నాడు. ఆయన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తారు.  ఈ సినిమాలో మన్నార చోప్రా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.  సోనూ సూద్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఎకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.  ఈ సమ్మర్లోనే 'సీత' ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తేజ లాస్ట్ సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  దీంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది.  హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్ గా ఉండడంతో తేజ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తాడనే అంచనాలు ఉన్నాయి.