సింగర్ సునీత! మేడమ్ నుంచి కన్న బుజ్జీ వరకూ వచ్చాడట!! అదీ నిమిషాల్లోనే!!!

Mon May 03 2021 09:02:43 GMT+0530 (IST)

Singer Sunita is a director who shocked herself

కొన్నిసార్లు కొంత కాలానికి మనల్ని ఇబ్బందిపెట్టిన కొన్ని విషయాలు తరవాత కొంత గ్యాప్ తర్వాత గుర్తు చేసుకుంటే చాలా ఫన్నీగా అనిపించవచ్చు. సింగర్ సునీత తనను షాక్ కి గురి చేసిన దర్శకుడి గురించి అలాంటి ఒక సంఘటనను పంచుకున్నారు.అది చాలా ఫన్నీ సంఘటనగా మారిందని ఆమె అనడం ఆసక్తికరం. ఓసారి డబ్బింగ్ థియేటర్ కి వెళ్ళినప్పుడు `మేడమ్` అని సంబోధించిన దర్శకుడు తనకు వీరాభిమానిని అని ఆమెకు చెప్పాడు. కొంతకాలం కలిసి పని చేశాక పిలుపే మారిపోయింది. తర్వాత అతడు `సునీత` అని పిలిచాడు. కొన్ని సన్నివేశాలకు డబ్ చేసిన తరువాత అతను కొన్ని సలహాలను ఇవ్వడం మొదలెట్టాడు. కానీ తనని పిలిచే విధానం ప్రవర్తన మారాయి. ఆరే..కన్నా.. బుజ్జీ.. ఇలా ఉందిట వాలకం. కొంత గ్యాప్ తర్వాత మేడమ్ అని పిలవకుండా అరే.. ! అంటూ పిలిచాడట. అంత ఫన్ నా అదృష్టం అని సునీత అన్నారు.

థాంక్ గాడ్.. డబ్బింగులో పొరపాట్లు దిద్దుబాట్లు పేరుతో మళ్లీ ఆ దర్శకుడిని కలిసే ఛాన్స్ రాలేదట. మొత్తానికి సునీత చెప్పిన ఈ ఎపిసోడ్స్ అన్నీ చూస్తుంటే ఇంతకీ ఆ డైరెక్టర్ కన్న ఎవరో తెలుసుకోవాలని అనిపించిందా.. ప్చ్.. అది మాత్రం చెప్పరు!!