Begin typing your search above and press return to search.

జూనియ‌ర్ రాక్ స్టార్ రైటింగ్ లో చూపిస్తాడు స‌త్తా!

By:  Tupaki Desk   |   30 Sep 2020 2:30 AM GMT
జూనియ‌ర్ రాక్ స్టార్ రైటింగ్ లో చూపిస్తాడు స‌త్తా!
X
యువ సంగీత సంచ‌ల‌నం రాక్ ‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సోద‌రుడు.. సింగ‌ర్ సాగ‌ర్ కొత్త రూట్ లోకి ఎంట‌ర‌వుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు గాయ‌కుడిగా,.. పాట‌ల ర‌చ‌యిత‌గా త‌న స‌త్తాని చాటిన సాగ‌ర్ త్వ‌ర‌లో కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నారు.

తండ్రి స‌త్య‌మూర్తి వార‌స‌త్వాన్ని సాగ‌ర్ కొన‌సాగించ‌బోతున్నారు. స‌త్య‌మూర్తి చాలా చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అందించిన క‌థ‌లు చాలా వ‌రకు సూప‌ర్ హిట్ లుగా నిలిచాయి. తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌డానికి తొలి ప్ర‌య‌త్నంగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టించిన `రాక్ష‌సుడు` చిత్రానికి మాట‌లు అందించిన సాగ‌ర్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో క‌లిసి మాట‌ల ర‌చ‌యిత‌గా ప‌నిచేయ‌బోతున్నారు.

పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం సెస్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాన్ ఇండియా స్థాయిలో `ఫైట‌ర్‌` చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ - హిందీ భాష‌ల్లోనూ రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. సాగ‌ర్ ఈ మూవీ త‌మి‌ళ్ వెర్ష‌న్ ‌కి డైలాగ్ ‌లు రాస్తున్నారు. సోమ‌వారం పూరి బ‌ర్త్ ‌డే సంద‌ర్భంగా సాగ‌ర్ విష్ చేస్తే పూరి అస‌లు విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు. మ‌న‌మిద్ద‌రం `ఫైట‌ర్‌` కోసం క‌లిసి ప‌నిచేస్తుండ‌టం సంతోషంగా వుంది. నీ రైటింగ్ స్కిల్స్ ‌తో మీ నాన్న‌ని గ‌ర్వ‌ప‌డేలా చేస్తావ్‌` అని పూరి అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు.