Begin typing your search above and press return to search.

ఆ యాక్సిడెంటుతో శింబు హై అలెర్ట్

By:  Tupaki Desk   |   26 Feb 2020 7:45 AM GMT
ఆ యాక్సిడెంటుతో శింబు హై అలెర్ట్
X
ఇటీవ‌ల `ఇండియ‌న్-2` సెట్స్ లో జ‌రిగిన క్రేన్ ప్ర‌మాదం దేశ‌వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ముగ్గురు దుర్మ‌ర‌ణం చెంద‌డంతో క‌మ‌ల్ హాసన్...శంక‌ర్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి. సినీ కార్మికుల ప‌ట్ల అంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అంటూ కోలీవుడ్ కార్మిక సంఘాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. మ‌ర‌ణాల వ‌ల్ల‌ కార్మిక సంఘాలు భ‌గ్గుమ‌నే స‌న్నివేశం క్రియేటైంది. ప్ర‌స్తుతం చెన్నై పోలీసులు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. క‌మ‌ల్..శంక‌ర్..నిర్మాత సుభాష్క‌ర‌న్ కు స‌మ‌న్లు జారీ అయ్యాయి. ఏ క్ష‌ణ‌మైనా విచార‌ణకు హాజ‌రు కావాల్సి ఉంటుంద‌ని తెలిపారు. నిజంగా క‌మ‌ల్... శంక‌ర్ సినీ కెరీర్లో ఇదొక మాయ‌ని మ‌చ్చ లాంటింది.

ఇదే అదునుగా పొలిటిక‌ల్ గానూ ఆ ఇద్ద‌రిపై ప‌నిగ‌ట్టుకుని విమ‌ర్శించేయ‌డం చూస్తున్న‌దే. కార‌ణం ఏదైనా.. ఈ ఎపెక్ట్ శింబు పైనా ప‌డింద‌ట‌. అత‌డు హీరోగా న‌టిస్తోన్న టీమ్ చాలా ముందుగానే అలెర్ట్ అయింది. ప్ర‌స్తుతం శింబు హీరోగా `మానాడు` అనే భారీ సినిమాని సురేష్ కామాక్షి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప‌ని చేస్తోన్న కార్మికుల‌కు స‌ద‌రు నిర్మాత ప్ర‌మాద‌ భీమా చేయించారట‌. దాదాపు 30 కోట్ల విలువైన భీమా చేయించార‌ని.. దీనికోసం ఏకంగా 7.8 ల‌క్ష‌లు ప్రీమియంగా చెల్లించారని తెలుస్తోంది. తాజా జాగ్ర‌త్త‌పై సినీకార్మికులు సంతోషం వ్య‌క్తం చేసారు.

ఇత‌ర‌ నిర్మాత‌లు కూడా ఇలానే భీమా చేయించాల‌ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్ర‌త్యేకంగా ఒక యూనియ‌న్ గా ఏర్పాటై ఆ విధి విధానాలు ఆ యూనియ‌న్ స‌మ‌క్షంలో జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంద‌ని కార్మికులంతా ఆలోచ‌న చేస్తున్నారు.