శింబు సోషల్‌మీడియా ఎంట్రీ.. పాత రికార్డులు బద్దలైపోతాయా?

Tue Oct 20 2020 21:30:06 GMT+0530 (IST)

Shimbu social media entry .. Will old records be broken?

తమిళనాట శింబూకు మాస్ హీరోగా ఎంతో క్రేజ్ ఉంది. అగ్ర హీరోల్లో అతడు కూడా ఒకరు. హిట్ ప్లాప్ లకు అతీతంగా అతడికి ఇమేజ్ ఉంది. అతడు చేసే డ్యాన్స్‌కు అభిమానులు మెస్మరైజ్ అవుతుంటారు. మాస్ జనంలో శింబూ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇటు క్లాస్ జనాలు కూడా శింబూను విపరీతంగా అభిమానిస్తారు. అందరూ హీరోలు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ప్రస్తుత తరుణంలో శింబూకు మాత్రం ఫేస్‌బుక్ ట్విట్టర్ ఇన్‌స్టా లాంటి సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు లేవు. ఈ విషయంపై అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు.అదీ కాక ఈ మధ్యకాలంలో హీరో హీరోయిన్లందరూ సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు చేరువతున్నారు. ఎప్పటికప్పుడు తమ యాక్టివిటీస్‌ను పంచుకుంటూ.. ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ వారిలో జోష్ నింపుతున్నారు. అయితే శింబూ అభిమానులు మాత్రం ఈ విషయంలో నిరాశగా ఉన్నారు. దీంతో అభిమానుల కోసం శింబూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారంలోకి రాబోతున్నాడు. అక్టోబర్ 22 న ఉదయం 9:09 గంటలకు నటుడు శింబూకు చెందిన ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్ ట్విట్టర్ యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఓపెన్ కానున్నాయి. శింబూ ప్రస్తుతం ‘మన్నాడు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో వస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్లో గ్లామర్ తార త్రిషను శింబు పెళ్లిచేసుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. వీటిపై వాళ్లిద్దరూ క్లారిటీ ఇవ్వలేదు.