కియరాతో డేటింగ్ లో లేను.. నమ్మాలా?

Fri Aug 10 2018 09:33:01 GMT+0530 (IST)

భరత్ అనే నేను - లస్ట్ స్టోరీస్ .. రెండూ బ్లాక్ బస్టర్లే. అయితే ఈ రెండిటిలో ఎక్కువ లాభం దేనితో? అంటే ఆ రెండో దానికే ఓటేస్తుంది కియరా అద్వాణీ. లస్ట్ స్టోరీస్ ఒక షార్ట్ స్టోరీ సిరీస్. ఇందులో తనకు నటించేందుకు - ఎక్స్ పోజ్ చేసేందుకు - ఇంకా చెప్పాలంటే చెలరేగిపోయేందుకు ఆస్కారం దొరికింది. ఆ ఒక్క సిరీస్ తో కియరా ఏంటో అందరికీ అర్థమైపోయింది. బాలీవుడ్ ఫిలింమేకర్స్ ఈ అమ్మడి అందాల ఆరబోతలో కళాపోషణకు స్పెల్ బౌండ్ అయిపోయారు. ఇంకేం ఉంది. మేకర్స్ కొత్తగా ఏదైనా సినిమా అనుకుంటే కియరా పేరు ముందు వరుసలో ఉంటోంది. లస్ట్ స్టోరీస్ కేవలం సినీ ఛాన్సులే కాదు ఓ అందగాడైన బోయ్ ఫ్రెండ్ ని ఇచ్చింది కియరాకు. ఈ భామ అంటే పడిచచ్చే సిద్ధార్థ్ మల్హోత్రాని ఇచ్చిందీ సిరీస్. అతగాడితో కియరా చెలిమి నెక్ట్స్ లెవల్ కు చేరుకుందన్న ప్రచారం సాగుతోంది. కియరా కనిపిస్తే చాలు సిద్ధార్థ్ తో డేట్ లో ఉన్నారట కదూ? అంటూ బాలీవుడ్ మీడియా దంచేస్తోంది. ఆ ప్రశ్నలకు ఇటు కియరా అటు సిద్ధార్థ్ ఇద్దరూ సమాధానం చెప్పుకోవాల్సొస్తోంది.లేటెస్టుగా ఇదే ప్రశ్న యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని ఉత్తరాది మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నించింది. అందుకు అట్నుంచి అస్పష్టమైన ఆన్సర్ వచ్చింది. కియరాతో డేటింగ్ లో లేను. ప్రస్తుతం నేను చేసే పనితోనే డేట్ లో ఉన్నాను! అంటూ డిప్లమాటిక్ ఆన్సర్ ఇచ్చాడు సిద్ధార్థ్. డేటింగులో లేనులే! అంటూ అటూ ఇటూగా చెప్పాడు. దీంతో అతడు ఎఫైర్ ని కన్ఫామ్ చేయలేదు.. ఖండించనూలేదు! అంటూ మరోసారి బాలీవుడ్ లో ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి. మొత్తానికి ఎస్ అనేంతవరకూ ఆ ఇద్దరినీ వదిలేట్టు లేరు.

సిద్ధార్థ్ బాలీవుడ్ కెరీర్ లో బిజీగా ఉంటే - కియరా అద్వాణీ ఉత్తరాది - దక్షిణాది అనే తేడా లేకుండా అన్నిచోట్లా చుట్టేస్తోంది. ప్రస్తుతం తెలుగులో చరణ్ తో సినిమా చేస్తూనే - కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన ఓ సినిమాకి సంతకం చేసేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టులో క్యూలైన్ లో ఉన్నాయి. దీపం ఉండగానే చుట్టబెట్టేస్తోంది ఈ అమ్మడు.