అమెరికా కోడలు తమ్ముడికే లైనేసిందా ఆవిడ?

Wed Jul 15 2020 10:30:49 GMT+0530 (IST)

Siddharth Chopra finds company in South actress Neelam Upadhyaya

మిస్టర్ 7 అనే చిత్రంతో తెలుగులో ఆరంగేట్రం చేసి అటుపై అల్లరి నరేష్ సరసన యాక్షన్ 3డి చిత్రంలో నటించింది నీలం ఉపాధ్యాయ్. కానీ ఇక్కడ కెరీర్ పరంగా ఏమంత వెలగలేదు. ఆ తర్వాత తమిళ పరిశ్రమలోనూ ప్రయత్నించినా కథానాయికగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ భామ నిండా ప్రేమలో మునిగిందిట. అది కూడా ఎవరితో అంటే?  అమెరికా కోడలు ప్రియాంక చోప్రా బ్రదర్ సిద్ధార్థ్ చోప్రాతో..తాజాగా సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా నీలం ఎంతో ప్రేమాప్యాయతల్ని కురిపిస్తూ అతడితో ఫుల్ గా షికార్లు చేసిన సందర్భాల్ని గుర్తు చేసుకుని మురిసిపోయింది. ఇన్ స్టాలో సిద్ధార్థ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోని షేర్ చేసి సుదర్ఘమైన నోట్ లో గుట్టంతా విప్పేసింది. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదు అంతకుమించి అని చెప్పకనే చెప్పేసింది.

నీను వీడని నీడను నేను! అన్న తీరుగా నీలమ్ అతడిని పెనవేసుకుపోతోంది మరి. ``లేస్ తో నా నోటిని నింపడం... లంచ్ డిన్నర్ లు.. కొత్త ప్రదేశాలకు  డ్రైవ్ లు.. నీతో నా పయనంలో ఇవన్నీ మర్చిపోలేను. నేను ఆ అందమైన రాత్రులను ప్రేమిస్తున్నాను. మీతో ప్రయాణాలు ఇష్టం. కొత్త ప్రదేశాలను అన్వేషించడం చాలా ఇష్టం…`` అంటూ నీలమ్ ఎంతో పోయెటిగ్గా ఎమోషన్ అయ్యింది. నన్ను కొత్త ప్రదేశాలకు తీసుకెళ్తున్నందుకు ఎల్లప్పుడూ ధన్యవాదాలు అని తెలిపింది. నిజానికి సిద్ధార్థ్ చోప్రా తన ప్రేయసి ఇషితా కుమార్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లికి ముందు అది అనూహ్యంగా రద్దయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు సింగిల్. ఇక ప్రేమా దోమా చాలించి సిద్ధార్థ్ - నీలం జంట ఒకటి కావాలని అభిమానులు సోషల్ మీడియాల్లో కోరుకుంటున్నారు.

అసలే పీసీ హాలీవుడ్ స్టార్ గా వెలిగిపోతోంది. అమెరికాలోనే స్థిరపడి నిక్ జోనాస్ తో కలిసి పెద్ద స్టార్ గా వెలిగిపోయేందుకు కలలు కంటోంది. ఇలాంటి సమయంలో పీసీ సోదరుడితో ఈ అమ్మడి లవ్ స్టోరి హాట్ టాపిక్ గా మారింది.