Begin typing your search above and press return to search.

పాత జ్ఞాపకాలు నెమరేసుకున్న ‘బొమ్మరిల్లు’ జోడీ

By:  Tupaki Desk   |   11 Aug 2020 5:30 PM GMT
పాత జ్ఞాపకాలు నెమరేసుకున్న ‘బొమ్మరిల్లు’ జోడీ
X
సిద్దార్థ జెనీలియా నటించిన బొమ్మరిల్లు సినిమా విడుదల 14 ఏళ్లు అవుతుంది. టాలీవుడ్‌ లో ఒక ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన బొమ్మరిల్లు భారీ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భాస్కర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించాడు. యూత్‌ ఆడియన్స్‌ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన బొమ్మరిల్లు సినిమా విడుదలై 14 ఏళ్లు అవుతున్నా ఇంకా సినిమా గురించి జనాల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా 14 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో హీరో సిద్దార్థ జెనీలియా వీడియో ఛాటింగ్‌ చేశారు.

సిద్దార్థతో వీడియో ఛాటింగ్‌ చేసిన జెనీలియా ఆ వీడియోను ఇన్‌ స్టా గ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. అపుడో ఇపుడో ఎపుడో అనే పాటను పెట్టి వీడియోను షేర్‌ చేసింది. వీడియోలో సిద్దార్థ మరియు జెనీలియాలు చాలా సరదాగా మాట్లాడుకోవడం చూడవచ్చు. వీడియోతో పాటు భాస్కర్‌ గారు దిల్‌ రాజు గారు ప్రకాష్‌ రాజ్‌ గారు మరియు దేవిశ్రీ మిస్‌ అయ్యారంటూ కామెంట్‌ పెట్టింది. జెనీలియా కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ బొమ్మరిల్లు అనే విషయం తెల్సిందే.

సినిమా విడుదల అయ్యి 14 ఏళ్లు అయినా కూడా హాసిని సిద్దుల మద్య ఉండే అంతేనా.. ఇంకేం కావాలి డైలాగ్‌ జనాలు మర్చి పోలేదు. అద్బుతమైన రెస్పాన్స్‌ వచ్చిన బొమ్మరిల్లు సినిమాతో ఇద్దరు కూడా ఇండస్ట్రీలో స్టార్స్‌ గా ఎదిగి పోయారు. ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌ పాత్ర ఇప్పటికి నెట్టింట మీమ్స్‌ అవుతూనే ఉంది. ప్రకాష్‌ పాత్ర కొన్ని పదుల సినిమాల్లో పేరడీ చేయడం మనం చూశాం.