శ్యామసింగ రాయ్..హిట్టు సినిమాలనిచ్చే నగరం నేపథ్యంలోనే!

Mon Sep 21 2020 16:20:45 GMT+0530 (IST)

Shyam Singha Roy Shooting updates

నేచురల్ స్టార్ నాని మూవీ వస్తోందంటే చాలు.. అది ఖచ్చితంగా వైవిధ్యం గానే ఉంటుందని తెలుగు ప్రేక్షకుల్లో ఓ  నమ్మకం ఏర్పడిపోయింది. ఎందుకంటే నాని సినిమాలు అలా ఉంటాయి మరి. సినిమాకు సినిమాకు భిన్నంగా నాని కథలు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతానికి టాలీవుడ్ హీరోల్లో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నది..  నానినే. ఇటీవల విడుదలైన ' వీ'  ఫలితం ఎలా ఉన్నా నాని నటనకు మాత్రం ప్రశంసలే  దక్కాయి. ప్రస్తుతం ' టక్ జగదీష్ ' సినిమా చేస్తున్న నాని.. ఆ లోగా మరో సినిమాను కూడా పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నాడు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యయన్ దర్శకత్వంలో 'శ్యామ సింగ రాయ్ ' సినిమాలో నాని నటిస్తున్నాడు. ఫాంటసీ మిక్స్ అయి ఎమోషనల్ గా ఉండే పక్కా ఫిక్షనల్ డ్రామాగా ఈ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కథ మొత్తం కలకత్తా నేపథ్యంలోనే సాగుతుంది. ఇప్పుడు కలకత్తా లో షూట్ చేసినా ఆనాటి పరిస్థితులు కట్టడాలు కనపడే  అవకాశం లేదు కాబట్టి హైదరాబాద్ లోని  అల్యూమినియం ఫ్యాక్టరీలో పాత కలకత్తా నగరాన్ని తలపించేలా భారీ సెట్టింగులు వేస్తున్నారు.  ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుంది. ఆమె పాత్ర చాలా ప్రత్యేకం గా ఉంటుందని చెప్తున్నారు. నాని మరో ప్రత్యేకమైన సినిమా చేస్తున్నట్టు  టైటిల్ పోస్టర్ లుక్  చూస్తే చాలు అర్థమవుతోంది. కలకత్తా నేపథ్యంలో ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు వచ్చాయి. చిరంజీవి చూడాలని ఉంది  వంటి హిట్టు సినిమా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కినదే.