Begin typing your search above and press return to search.

ప్రోమో: మీసం మెలేస్తున్న శ్యామ్ సింగ‌రాయ్

By:  Tupaki Desk   |   1 Dec 2021 1:03 PM GMT
ప్రోమో: మీసం మెలేస్తున్న శ్యామ్ సింగ‌రాయ్
X
మీసం మెలేస్తున్నాడు.. క‌నుబొమ‌లు ఎగ‌రేస్తున్నాడు.. మ‌గువ‌ల‌కు ఆటోగ్రాప్ ఇస్తున్నాడు. కొంచెం పెద్ద మ‌నిషి త‌ర‌హాగా క‌నిపిస్తున్నాడు.. అత‌డిని చూస్తే జ‌నం వంగి వంగి స‌లాం కొడుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రీయ‌న‌? అంటే.. పేరు శ్యామ్ సింగ‌రాయ్. మీసం రోషం ఉన్నోడు. గెలుపే ధ్యేయంగా సంఘంలో స‌త్తా చాటేవాడు.. ది గ్రేట్ శ్యాం సింగ‌రాయ్ అని అర్థ‌మ‌వుతోంది.

తాజా ప్రోమో నాని ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రోమో ఆద్యంతం సింగ‌రాయ్ ఎలివేష‌న్ పీక్స్ లో వ‌ర్క‌వుటైంది. నాని లుక్ గెట‌ప్ ఆహార్యం ప్ర‌తిదీ మారిపోయింది. ఒక కొత్త నానీని చూస్తున్న‌ట్టే ఉంది. ప‌క్క పాపిడి మెలి తిప్పిన రింగు మీసం మెలి వేయ‌డం వ‌గైరా వ‌గైరా అత‌డి ని ప్ర‌త్యేకంగా ఆవిష్క‌రిస్తున్నాయి. దార‌పు మ‌గ్గం తిప్పుతున్న నాని ని చూస్తుంటే ఆ పాత్ర‌లోని డెప్త్ వేరే లెవ‌ల్లో ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

24 డిసెంబ‌ర్ శ్యామ్ సింగ‌రాయ్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్ల‌వి- కృతి శెట్టి లాంటి ట్యాలెంటెడ్ మ‌ల్లూగాళ్స్ న‌టించ‌డం అద‌న‌పు బ‌లం. నిహారిక‌ టైన్ మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ సెట్స్ లో మెజారిటీ షెడ్యూల్ ని చిత్రీక‌రించారు. ఇది సినిమాకే హైలైట్ గా ఉంటుంద‌ని స‌మాచారం.