'మీర్జాపూర్ సీజన్-3' కోసం శ్వేతా త్రిపాఠి కఠోర శిక్షణ!

Fri Aug 05 2022 14:08:30 GMT+0530 (IST)

Shwetha Tripathi Training For Mirzapur Season3

బాలీవుడ్ 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఎంత పెద్ద విజయం సాధించిందో? చెప్పాల్సిన పనిలేదు. రెండు సీజన్లు అమెజాన్ ప్రైమ్ ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రైమ్ రేటింగ్ సైతం మెరుగు పరచడంలో ఈసీరిస్ కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. తెలుగు ఆడియన్స్ సైతం ఎంతగానో అలరించిన  సిరీస్ ఇది.అందులో ప్రతీ పాత్ర టాలీవుడ్ ఆడియన్స్ కి సైతం ఎంతగానో కనెక్ట్ అయింది.   మీర్జాపూర్ సెకండ్ సీజన్‌లో శ్వేతా ప్రధాన పాత్ర పోషించింది. అమ్మడి అభినయంతో పాటు హాట్ సీన్స్‌లోనూ తనదైన మార్క్ వేసింది. మీర్జాపూర్  తొలి రెండు సంచలనాల నేపథ్యంలో పార్ట్-3 పై ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందంటూ? అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకటే రచ్చ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆసక్తిని రెట్టింపు చేస్తూ..

శ్వేతా త్రిపాఠి షో నుండి తన పాత్ర గోలు గుప్తా కోసం సిద్ధమవుతున్న వీడియోను అభిమానులతో  పంచుకున్నారు.
తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో ఇప్పుడు  నెట్టింట వైరల్ గా మరింది. శ్వేత పాత్ర కోసం బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం.. కఠినమైన శారీరక శిక్షణ తీసుకోవడం గమనింవచ్చు. ఆ పాత్రపై ప్రేమనంతటని ప్రాక్టీస్ రూపంలో చాటుతుంది.

సీజన్ 3 కోసం  గోలు పూర్తిగా ఊపందుకున్నట్లు కనిపిస్తోంది.  శ్వేత వీడియోని ఉద్దేశించి ఇలా  క్యాప్షన్ ఇచ్చింది "గోలు 3.0 @ బట్టతవాడా మీర్జాపూర్‌లో చర్యకు సిద్ధంగా ఉంది'' అంటూ రాసుకొచ్చింది. ఇప్పటికే  శ్వేత  త్రిపాఠి అనేక ప్రశంసలు పొందిన చిత్రాలలో నటించింది.  కానీ  'మీర్జాపూర్లో' గోలు గుప్తా పాత్రకు వచ్చిన గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది.

ఎన్నో సినిమాలు సక్సెస్ తో గోలు పాత్రని పోల్చవచ్చు.   శ్వేతతో పాటు 'మిర్జాపూర్ 3' లో పంకజ్ త్రిపాఠి.. అలీ ఫజల్.. రసిక దుగల్.. విజయ్ వర్మ.. హర్షిత గౌర్.. ప్రియాంషు పైన్యులి.. షీబా చద్దా.. రాజేష్ తైలాంగ్.. అంజుమ్ శర్మ తదితరులు నటిస్తున్నారు.

విజయ్ వర్మ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో 'మీర్జాపూర్ 3' చిత్రీకరణ ప్రారంభించినట్లు ప్రకటించారు.  ఈ సిరీస్ కి గుర్మీత్ సింగ్ మరియు ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎక్సెల్ మీడియా  ఎంటర్‌టైన్‌మెంట్  నిర్మిస్తుంది.