తింగరిలా ఉంది.. కానీ సొగసరే..!

Thu May 28 2020 14:40:13 GMT+0530 (IST)

Shurthi Haasan Comic Pose

సినీ లోకంలోకి బాలనటిగా మొదలుపెట్టి నేడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగుతుంది శృతి హాసన్. 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన శృతి.. తమిళ హిందీ బాషలలో కూడా హీరోయిన్ గా రాణిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శృతి హాసన్ హీరోయిన్ గా సింగర్‌గా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ నిజానికి హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన సమయంలో తమిళ తెలుగు హిందీ భాషల్లో కొన్ని సినిమాలలో నటించినా పెద్దగా లక్ కలిసి రాలేదు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్-హరీష్‌శంకర్‌ల కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలోని భాగ్యలక్ష్మి పాత్ర ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక అప్పటి నుండి వరుసగా టాలీవుడ్ సౌత్ హీరోల అందరితో కలిసి నటించింది. ఇక తమిళ హిందీ చిత్రాలలో కూడా నిలదొక్కుకునే సమయంలో ప్రేమలో పడి కెరీర్ ని మరిచిపోయింది. దాంతో అమ్మడి వైపు ఎవ్వరూ తిరిగి చూడలేదు. ఇక చివరగా పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు సినిమాలో నటించింది.ఈ సినిమాలో అమ్మడి లుక్‌ని చూసి అందరు గుడ్ కాంబినేషన్ అనుకున్నారు. కానీ ఆ సినిమాకు శృతి అవసరం లేదని అనుజున్నారంతా. ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇస్తూ తమిళంలో విజయ్ సేతుపతి సరసన 'లాభం' అనే చిత్రంలో నటిస్తుంది. ఇక టాలీవుడ్లో 'వకీల్ సాబ్' చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన మూడోసారి నటిస్తుంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. అంతేగాక మాస్ రాజా రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'క్రాక్'లో రవితేజ సరసన నటిస్తోంది. ఇందులో శృతి రవితేజ భార్య పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్స్ లేక ఇంట్లోనే ఉంటున్న ఈ భామ.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తాజా తాజా ఫొటోస్ షేర్ చేస్తుంది. మొన్నటి వరకు అందాల ఆరబోతతో కుర్ర గుండెలు కొల్లగొట్టిన శృతి.. తాజా ఫోటోలో క్యూట్ అండ్ కిల్లింగ్ ఎక్సప్రెషన్స్ తో పిచ్చేక్కిస్తుంది. ఆ ఫొటో చూసి మరికొందరు తింగరిలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా లాక్ డౌన్లో సోషల్ మీడియాకు బాగా కనెక్ట్ అయ్యింది శృతి. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అయి చెక్కర్లు కొడుతోంది.