Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ ముసలమ్మ అవతారం

By:  Tupaki Desk   |   19 July 2019 8:45 AM GMT
స్టార్ హీరోయిన్ ముసలమ్మ అవతారం
X
ఈమధ్య ఓల్డ్ ఏజ్ ఛాలెంజ్.. ఫేస్ యాప్ కొత్త ట్రెండ్ గా మారింది కదా. బాలీవుడ్ లో ఇప్పటికే అర్జున్ కపూర్.. వరుణ్ ధావన్.. ఆయుష్మాన్ ఖురానా లాంటివారు ఫేస్ యాప్ ఫిల్టర్ ద్వారా వచ్చిన తమ ఓల్డ్ ఏజ్ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేయడం జరిగింది. మిగతా బాలీవుడ్ స్టార్లు.. క్రికెటర్ల ఓల్డ్ ఏజ్ ఫోటోలు సోషల్ మీడిలో చక్కర్లు కొడుతున్నాయి కానీ అవి సదరు సెలబ్రిటీలు స్వయంగా షేర్ చేసినవి కావు.

అయితే ఈ ఛాలెంజ్ హీరోలకే ఇబ్బంది అనిపిస్తే.. గ్లామర్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉండే హీరోయిన్ లకు మరింత ఇబ్బందిగా ఉంటుందని చెప్పక తప్పదు. సాధారణంగా హీరోయిన్లు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫోటో కరెక్షన్ యాప్స్ యూజ్ చేస్తారు. న్యాచురల్ అని చెప్పి షేర్ చేసిన ఫోటోలను కూడా నమ్మడానికి లేదు.. అలా ఉంటుంది వ్యవహారం. అలాంటప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ ఛాలెంజ్ ఫోటోలు షేర్ చేస్తారని అనుకోవడం కష్టమే. శృతి హాసన్ తాజాగా ఈ ఓల్డ్ ఏజ్ ఛాలెంజ్ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలో శృతి తన అమ్మగారు సారిక లాగా కనిపిస్తోంది.

ఈ ఫోటోకు శృతి "నా జీవితంలో వెనక్కు తిరిగి చూసుకుంటే నేను నా అందమైన జీవితానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.. పది మంది మనవళ్ళు మనవరాళ్ళతో సంతోషంగా ఉంది. మరి మనసులు ఇంత సంతోషంగా ఎలా ఉన్నావని ఎవరైనా అడిగితే నా జవాబు ఒకటే.. హెవీ మెటల్ మ్యూజిక్ కు ఎక్సర్ సైజ్ చేయడం.. గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ తినడం అని చెప్తాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అంటే తనకు ఎనభై తొంభై ఏళ్ళ వయసు అనుకుంటూ ఈ బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టింది. ఫ్యాన్స్ ఈ ఫోటోకు థ్రిల్ అవుతున్నారు. ఈ ఫోటోకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా వచ్చాయి. "నువ్వు ఓల్డ్ అయినా గోల్డే" అని ఒకరు కామెంట్ చేయగా మరొకరు "మేకప్ లేని ఫోటో ఇలా ఉంటుందా?" అంటూ పంచ్ వేశారు.