తెలుగు `లస్ట్ స్టోరీస్`లో శ్రుతి గ్లామర్ ట్రీట్ పరాకాష్టలో

Sun Sep 27 2020 14:00:03 GMT+0530 (IST)

Shruti Hasan in Telugu Lust Stories

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ `లస్ట్ స్టోరీస్`. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ రొమాంటిక్ వెబ్ డ్రామాతో కియారా అద్వానీ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇదే వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ తెలుగులో రీమేక్ చేస్తోంది. ఇందుకోసం నలుగురు దర్శకుల్ని ఎంచుకుంది. సంకల్ప్ రెడ్డి.. తరుణ్ భాస్కర్ ..నందినిరెడ్డి సిరీస్ లో పలు భాగాలకు దర్శకత్వం వహిస్తుండగా..తాజాగా నాగ్ అశ్విన్ ని వేరొక ఎపిసోడ్ కోసం దర్శకుడిగా ఖరారు చేసుకున్నారని తెలిసింది.ఇప్పటికి మూడు ఎపిసోడ్లకు సంబంధించిన  పనిని నందిని రెడ్డి- తరుణ్ భాస్కర్ - సంకల్ప్ రెడ్డి పూర్తి చేశారు. ఓ ఎపిసోడ్ లో ఇషా రెబ్బ నటించింది కూడా. ఇక కియరా ఎపిసోడ్ కోసం నాగ్ అశ్విన్ ని తీసుకున్నారు. ఇందులో శృతిహాసన్... ఒరిజినల్ లో కియారా పోషించిన పాత్రలో కనిపించబోతోందని తెలిసింది. ఇటీవలే సారథి స్టూడియోస్ లో దీనికి సంబంధించిన ఎసిసోడ్ ని షూట్ చేశారట.

ఈ వెబ్ సిరీస్ తో శృతిహాసన్ ఓ రేంజ్‌లో రచ్చ చేయడం గ్యారంటీ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. శృతి ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో కలిసి `క్రాక్` చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ మూవీని గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.