శ్రుతి హాసన్ రాంగ్ ట్వీట్.. తిట్ల వర్షం

Wed Aug 08 2018 20:00:26 GMT+0530 (IST)

సోషల్ మీడియాలో సెలబ్రెటీలు వేసే ప్రతి అడుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్లకు బ్యాండ్ పడిపోతుంది. ఒక ట్వీట్ వేసేటపుడు పరి పరి విధాలా ఆలోచించాల్సిందే. లేకుంటే తాజాగా శ్రుతి హాసన్ కు ఎదురైనట్లే చేదు అనుభవం తప్పదు. నిన్న రాత్రి నుంచి ట్విట్టర్లో ఇండియన్స్ అందరికీ ఒకటే టాపిక్. అదే.. కరుణానిధి మరణం. కేవలం దక్షిణాది వాళ్లే కాదు.. ఉత్తరాది జనాలు కూడా కరుణ మరణం గురించే మాట్లాడుకుంటున్నారు. దక్షిణాది.. జాతీయ రాజకీయాలపై ఆయన ప్రభావం గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయనకు సంతాపాలు ప్రకటిస్తున్నారు. ఇక తమిళ జనాల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. అందరూ విషాదంలో మునిగిపోయి ఉన్నారు. కరుణకు నివాళి అర్పిస్తున్నారు.ఇలాంటి టైంలో శ్రుతి హాసన్ ఒక రాంగ్ ట్వీట్ చేసి నెటిజన్లకు దొరికిపోయింది. కరుణ మరణానికి సంతాపం ప్రకటించకపోగా.. ఆమె తాను లండన్ లో చేస్తున్న మ్యూజిక్ ఆల్బం గురించి ప్రస్తావించింది. ఇది ఫన్ టైం అంటూ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. శ్రుతికి కరుణ గురించి తెలియకుండా ఉంటుందని ఎవరూ భావించడం లేదు. ఆమె తండ్రి కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయ నేత. ఒక పార్టీని కూడా నడిపిస్తున్నారు. కరుణ మరణంపై ఆయన కూడా ఉద్వేగంగా స్పందించారు. అలాంటిది శ్రుతి మాత్రం ఇదేమీ పట్టనట్లు తన ఆల్బం గురించి ప్రస్తావించే సరికి జనాలకు మండిపోయింది. సంతాపం ప్రకటించకపోగా ఈ ట్వీట్లేంటంటూ ఆమెను తిట్టిపోశారు. కనీస ఇంగిత జ్నానం లేదా అంటూ విమర్శించారు. ఐతే శ్రుతికి విషయ తీవ్రత అర్థమైంద లేదో కానీ.. ఆమె మాత్రం తన ట్వీట్ ను డెలీట్ చేయలేదు. కరుణకు సంతాపం ప్రకటించలేదు.