బాధపడుతున్న వారికి క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్

Wed Jul 06 2022 12:00:01 GMT+0530 (IST)

Shruti Haasan gave clarity to those suffering

గత రెండు మూడు రోజులుగా శృతి హాసన్ అనారోగ్య సమస్యల గురించి మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. వెబ్ మీడియా మరియు సోషల్ మీడియాలో శృతి హాసన్ కు ఏదో అయ్యింది.. ఏదో అయిపోతుంది అన్నట్లుగానే పుంకాను పుంకాలుగా కొందరు మిస్ లీడింగ్ హెడ్ లైన్స్ పెట్టి ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగించారు.అసలు విషయం ఏంటీ అంటే శృతి హాసన్ ఇటీవల ఒక వర్కౌట్ వీడియోను షేర్ చేసి తాను PCOS అనే సమస్యతో బాధపడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆ సమస్య కారణంగా జీర్ణక్రియ సరిగా ఉండక పోవడంతో పాటు పీరియడ్స్ సరైన సమయం కు రాకపోవడం... ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం జరుగుతుందట. ఈ సమస్య అనేది చాలా సాధారణ మరియు రెగ్యులర్ సమస్య.

కొందరు మాత్రం ఈ విషయం ను హైలైట్ చేస్తూ శృతి హాసన్ ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె అభిమానులను భయభ్రాంతులకు గురి చేశారు. దాంతో సోషల్ మీడియా ద్వారా కొన్ని వేల కొద్ది మెసేజ్ లు అందుకుంది. గెట్ వెల్ సూన్ అంటూ ఆమెకు వేల సంఖ్యలో మెసేజ్ లు మరియు కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో స్వయంగా ఒక వీడియో ద్వారా స్పందించింది.

తన PCOS సమస్య అనేది చాలా కామన్ విషయం. ఇప్పుడు కొత్తగా ఈ సమస్య నన్ను వేధించడం లేదు. చాలా ఏళ్లుగా ఆ సమస్యతో నేను బాధపడుతున్నాను. ఆ సమస్యను అధిగమిస్తూ నేను ముందుకు సాగుతున్నాను. ప్రతి మహిళకు ఉండే రెగ్యులర్ సమస్య అది. కనుక నా ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు అన్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా పేర్కొంది.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తో కలిసి సలార్ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా చిరంజీవి నటిస్తున్న సినిమాలో కూడా ఈమె నటిస్తోంది.

తమిళం మరియు హిందీల్లో కూడా ఈమె సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు వరుసగా త్వరలో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది.