పెళ్లిపై శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!

Thu May 26 2022 09:42:37 GMT+0530 (IST)

Shruti Haasan comments on wedding go viral!

విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ కెరీర్ పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్..కోలీవుడ్  లో వరుసగా సినిమాలు చేస్తూ మళ్లీ గత వైభవాన్ని అందుకుంటుంది. మాజీ ప్రియుడు మైఖెల్ కోర్సలే కారణంగా కొన్నాళ్ల పాటు కెరీర్ ని లైట్ తీసుకున్నా మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది.సినిమాలతో పాటు..కొత్త బోయ్ ప్రెండ్ తోనూ ఎంతో సన్నిహితంగా ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్  శంతను హజారికాతో అమ్మడు పీకల్లోతూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మరి తొలి ప్రేమ బెడిసి  కొట్టింది..మలి ప్రేమనైనా వివాహ బంధం వరకూ తీసుకెళ్తుందా? అంటే సందేహాలే వ్యక్తం అవుతున్నాయి. పెళ్లి మాట అంటేనే అదో టెర్రిపిక్ అనుభవం అన్న చందంగా మాట్లాడుతుంది.

పెళ్లి ఆలోచన ఉందా? అన్న ప్రశ్న శ్రుతిహాసన్ ముందుకెళ్తే కాసింత ఆదోళనకరంగానే స్పందించింది.  తాను స్వయంగా చూసిన కొన్ని అనుభవాల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. శ్రుతి హాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్ -సారిక సహజీనవంతో జీవితం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే పిల్లల్ని కన్నారు. ఆ తర్వాత కమల్ -సారిక వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఆ తర్వాత మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులతో వేరయ్యారు. మరి ఇలాంటి కారణాల్ని శ్రుతి వివాహ జీవితంపై ప్రభావం చూపిస్తున్నాయా? అన్న కారణంగా విరక్తి చెందిందా? అంటే అలాంటిదేమి లేదని  తెలిపింది. విడాకులు తీసుకున్నా...కలిసి ఉన్నంత కాలం ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపింది. విడాకులు తీసుకున్న కలిసి ఉన్నంత కాలం ఎన్నో మధుర క్షణాలున్నాయని తెలిపింది.

శ్రుతి హాసన్ మాటల్ని బట్టి వివాహ బంధం కన్నా..సహజీవనానికే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది.  కలిసి  ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలి. విడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలేషన్ బ్రేక్ చేసుకోవడానికి సహజీవనమైతేనే ఉత్తంగా ఉంటుందన్న ధోరణి కనిపిస్తుంది. దీంతో శంతను హజారికాతోనూ అమ్మడి బాండింగ్ కొన్నాళ్లేనా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. కొంత మంది భామలు వివాహ వ్యవస్థకి వ్యతిరేకం. పెళ్లి కన్నా  లివ్ ఇన్ రిలేషన్ కే మొగ్గు చూపుతారు. ఆ కోవలో శ్రుతి చేరినట్లే అంటున్నారు.  

ఇక శ్రుతి హాసన్ సినిమాల విషయానికి వస్తే నటిగా బిజీగా ఉంది. పాన్ ఇండియా చిత్రం `సలార్` లో  ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తిచేసింది. దాదాపు తన పాత్ర షూటింగ్ పూర్తయింది.  అలాగే నటిసంహ బాలకృష్ణ హీరోగా న టిస్తోన్న 107వ  చిత్రంలోనూ ఈభామనే హీరోయిన్.

బాలయ్య సినిమా ఎంట్రీతో మిగతా హీరోలకు శ్రుతిహాసన్ విషయంలో లైన్ క్లియర్ అయింది. బాలయ్య వయసును శ్రుతి హాసన్ మ్యాచ్ చేయగల్గితే  చిరంజీవి..నాగార్జున..వెంకటేష్ లాంటి వారు కూడా రెడీ అంటారు.