షాకింగ్: శ‌్రుతిలో ఇంత వేదాంతమా?

Tue Jun 11 2019 22:08:50 GMT+0530 (IST)

Shruti Haasan Talking About Her Future Plans

లైఫ్ లో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండడం అన్నది కొందరికే చెల్లుతుంది. ఆ కేటగిరీకే చెందుతుంది శ్రుతిహాసన్. తాను ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి బలంగా కట్టుబడి స్ట్రాంగ్ పర్సనాలిటీని రివీల్ చేసింది శ్రుతి. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే సడెన్ గా బ్రేకిచ్చింది. వ్యక్తిగత జీవితానికి టైమ్ కేటాయిస్తున్నానని సూటిగా ప్రకటించింది. అనంతరం విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణం సహజీవనం అనంతర పరిణామాలు తెలిసిందే. గత ఏడాది మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయిన శ్రుతిహాసన్ ప్రస్తుతం లోన్ లీగా ఉంటున్న సంగతి తెలిసిందే.  రెండేళ్ల ప్రేమాయణం అనంతరం ప్రియుడితో బ్రేకప్ తర్వాత కూడా శ్రుతి ఏమాత్రం దిగాలు పడిపోకుండా తిరిగి కెరియర్ ని రీలాంచ్ చేసిన తీరు ఆసక్తికరం. ఓవైపు మ్యూజిక్ ... మరోవైపు సినిమాలను ఎంతో సమర్థంగా మ్యానేజ్ చేస్తోంది. ప్రస్తుతం మ్యూజిక్ కాన్సెర్టులతో పాటు వరుసగా సినిమాలకు కమిటైంది.ప్రస్తుతం `లాభం` అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. శివకార్తికేయన్ ఈ చిత్రంలో కథానాయకుడు. దీంతో పాటు ఇతర భాషల్లోనూ పలు సినిమాలకు సంతకాలు చేసింది. తెలుగులో ఓ సినిమా చేయనున్నానని ప్రకటించింది. ఇక తాజాగా శ్రుతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్రేకప్ తర్వాత ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు. ``నేను నా జీవితంలో ఎంతో సంతోషకరమైన దశలో ఉన్నాను. ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నాను. మైఖేల్ నుంచి బ్రేకప్ అయ్యాక .. శ్రుతి ఎందుకిలా చేస్తోంది అని అనుకున్నారంతా. కానీ అది నా జీవితంలో ఉత్తమ నిర్ణయం అనిపించింది. నేనెప్పుడూ నా సంతోషానికే ప్రాధాన్యతనిస్తాను. అది ఒక పెర్ఫ్యూమ్ ని సెలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కువ వాసన పీల్చేశాక.. ఒకవేళ బ్రేక్ తీసుకోకపోతే ఆ వాసన ఎలా ఉందో చెప్పలేం. అలాగే జీవితం కూడా దానంతట అది సాగుతుంటుంది. మనం తర్వాతి స్టెప్ తీసుకోకపోతే అది అలానే వెళ్లిపోతుంటుంది. ఆగి కొంచెం ఊపిరి తీసుకుంటే కానీ అసలు నిర్ణయంతీసుకోలేం. ఏం చేయాలి. ఎలా వెళ్ళాలి  అన్నది తేల్చేకోలేం`` అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది.

గత ఏడాది నాపై సాగించిన ప్రచారం ప్రకారం.. నేను ఈపాటికే పెళ్లాడి ముగ్గురు పిల్లల్ని కని అటుపై  విడాకులు కూడా ఇచ్చేయాల్సింది. అలాంటి ఆర్టికల్స్ నాపై వచ్చాయి. అది చాలా ఫన్నీగా అనిపించింది నాకు. కెరియర్ కి కొంచెం బ్రేక్ ఇచ్చాను అనగానే ఇలాంటివన్నీ పుట్టుకొచ్చాయి. నాకు పెళ్లి అంటే చాలా భయం. శ్రుతికి పెళ్లవుతోంది అన్న వార్త వినగానే ఒణికిపోయాను. అందుకే నేను అలా చేయొద్దనుకున్నాను. అందుకే అలాంటివి నాకు చెప్పొద్దు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ తర్వాత వర్క్ చేసేదానివా? అంటే.. నాకు పెళ్లి తర్వాత కూడా కెరియర్ తప్పనిసరి. భవిష్యత్ లో నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా కెరియర్ ని మాత్రం విడిచిపెట్టను. దానిని ఒక రూల్ లా పెట్టుకున్నా. నేను వర్కింగ్ వైఫ్ లా .. వర్కింగ్ మమ్మీలా ఉండాలని అనుకుంటున్నా... అని శ్రుతి తెలిపింది.

మీలోని రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పండి? అంటే.. ``నేను చాలా రొమాంటిక్. నేను పెరిగి పెద్దయ్యే క్రమంలో రొమాంటిక్ అన్న సంగతి తెలిసింది. ఎప్పుడైతే నేను ఎదుటివారిని ప్రేమించానని బలంగా అనుకుంటానో అప్పుడు పూర్తి రొమాంటిక్ గా ఉంటాను. అతడెంతలే అని అనుకుంటే మాత్రం అస్సలు ఆ పీల్ అన్నదే ఉండదు... అని కుండబద్ధలు కొట్టినట్టే చెప్పేసింది. ఇంత క్లియర్ కట్ గా మాట్లాడే వేరొక కథానాయికను చూడలేం సుమీ!!