లవ్ బ్రేకప్.. లవర్ క్యారెక్టర్ పై శ్రుతి!

Wed Oct 09 2019 13:40:15 GMT+0530 (IST)

Shruti Haasan Opens Up About Life Post Break-Up With Boyfriend Micheal Corsale

ఒక సర్వే ప్రకారం.. 90 పర్సంట్ బ్రేకప్ లవ్ స్టోరీలే. అందులో స్టార్ డాటర్ శ్రుతిహాసన్ లవ్ స్టోరి కూడా ఉంది. లండన్ బోయ్ మైఖేల్ కోర్సలేతో నిండా ప్రేమలో మునిగిన ఈ భామ పెళ్లికి సిద్ధమైందని వార్తలొచ్చాయి. పెళ్లాడాలన్న ఆలోచనతోనే ప్రియుడిని తన మామ్ డాడ్ లకు పరిచయం చేసింది శ్రుతిహాసన్. ఓ పెళ్లిలో కొత్త పెళ్లికొడుకులా మైఖేల్ కోర్సలే జరీ అంచు పంచె కట్టి మామ కమల్ హాసన్ పక్కన కూచోవడంతో ఇక పెళ్లి ఖాయం అని అనుకున్నారంతా.అయితే ఆ తర్వాతనే లైఫ్ టర్న్ అయ్యింది. శ్రుతి కొన్నాళ్ల పాటు ముంబైలో మైఖేల్ తో సహజీవనం చేసింది. ఆ ఫోటోలు వెబ్ లో వైరల్ అయ్యాయి. అయితే కాలక్రమంలో ఈ ప్రేమలో సడెన్ ట్విస్ట్ ఎదురైంది. మేఖేల్ నుంచి విడిపోయాను అని ప్రకటించింది శ్రుతి. ఆ ఇద్దరూ దానిని అధికారికంగా ధృవీకరించడంతో అభిమానులు షాక్ తిన్నారు. అసలేమైంది?  విడిపోవడానికి కారణమేంటి? అన్నది ఇప్పటివరకూ శ్రుతి ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు.

ఎట్టకేలకు తన స్నేహితురాలు మంచు లక్ష్మి ఆ రహస్యాన్ని బయటకు చెప్పించేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫీటప్ విత్ స్టార్స్ కార్యక్రమంలో లక్ష్మీ మంచు ఇప్పటికే ఎందరో స్టార్ల గుట్టు కాస్తా లాగేశారు. ముఖ్యంగా పడకగది రహస్యాలు స్వయంగా వాళ్ల చేతనే చెప్పించారు. తాజా ఎపిసోడ్ లో శ్రుతిహాసన్ లవ్ బ్రేకప్ కి సంబంధించిన రహస్యాల్ని చెప్పించారు. శ్రుతి మాట్లాడుతూ.. ``మైఖేల్ కోర్సలేతో నా బాంధావ్యం బాగానే ఉండేది. చాలా ప్రశాంతంగా.. ఎమోషనల్ గా ఉండే నేను.. బయటకు కనిపించనంత కటువుకాదు..  అమాయకురాలినే. బయట ప్రపంచంలో అందరూ నాపై బాస్ లాగా ఉండటం చూశాను..  అతడితో బ్రేకప్ దురదృష్టకరం`` అని ఎమోషన్ అయ్యారు. అయితే ప్రేమలో వైఫల్యాన్ని రిగ్రెట్ గా భావించడం లేదని అన్నారు. ప్రేమ వైఫల్యం నాకు గొప్ప అనుభవాన్ని కలిగించింది. లవ్‌లో పడటానికి ఫార్ములా ఉండదనేది నా ఫీలింగ్. అయినా మన టైమ్ బాగుంటే అందరూ మంచిగా కనిపిస్తారు.  టైమ్ బ్యాడ్ అయితే వాళ్లంతా చెడ్డవాళ్లుగా కనిపిస్తారు. బ్రేకప్ విషయంలో నేను తప్పు చేశాననే ఫీలింగ్ లేదు. ఒక మంచి అనుభవం సంపాదించాను. జీవితంలో రోజు నేర్చుకొనే ఓ పాఠాల్లో ఇది కూడా ఒకటి అని శృతి హాసన్ అన్నారు. వైఫల్యం ఎలాంటి ప్రభావం చూపదు. గొప్ప ప్రేమ ఎక్కడ దొరుకుందా? అన్నదే పాయింట్ అని శ్రుతి  వ్యాఖ్యానించింది. బ్రేకప్ అయ్యిందని ఎవరినీ దూషించను. నా చుట్టూ చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. వారికి నేను మంచి స్నేహితురాలిగా ఉంటాను అని శ్రుతి వెల్లడించింది. కెరీర్ పరంగా చూస్తే శ్రుతి ప్రస్తుతం హాలీవుడ్ లో ట్రెడ్ స్టోన్ అనే చిత్రంలో నటిస్తోంది. తమిళంలో లాభం అనే చిత్రంలో నటిస్తోంది.