శ్రుతిహాసన్ .. ఆకాశమే హద్దుగా ఆ ఫోజు!

Thu Oct 28 2021 12:01:30 GMT+0530 (IST)

Shruti Haasan New Trendy And Beautiful Look

వెటరన్ హీరో కమల్ హాసన్ గారాలపట్టిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ముందు ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకున్నా నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ సక్సెస్ ని తనవైపు తిప్పుకుని అటుపై క్రేజీ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. గాయనిగా.. సంగీత దర్శకురాలిగా.. ఆల్ రౌండర్ గా సత్తా చాటడంతో వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అంతే కాకుండా కమల్ కూతురు అనే ముద్రని అనతి కాలంలోనే చెరిపేసుకుని తన కంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని గుర్తింపుని సొంతం చేసుకుంది. ప్రియుడితో విడిపోయి సినిమాలకు కాస్త బ్రేకిచ్చిన శృతి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.మాస్ మహారాజా రవితేజ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `క్రాక్`తో సెకండ్ ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టిన శృతి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్థాయి మూవీలో నటించే గోల్డెన్ ఆఫర్ ని కూడా దక్కించుకుంది. అదే `సలార్`. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీని `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూవీతో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరాలని భావిస్తోంది శృతి. ఖాళీ దొరికితే ఇన్ స్టా వేదికగా అభిమానులతో టచ్ లో వుంటున్న శృతి తన హాట్ ఫొటోలని పోస్ట్ చేస్తూ అభిమానుల్ని మరింతగా ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా శృతి షేర్ చేసిన ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. థైస్ కనిపించేలా థిక్ బ్లూ కలర్ షార్ట్ ఫ్రాక్ లో తనని తాను మర్చిపోయి తన్మయత్వంతో ఊహాల పల్లకిలో విహరిస్తూ కనిపించింది శృతి. ఈ ఫొటో చూసిన అభిమానులు ఊహాల పల్లకిలో అందాల బొమ్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు.