శ్రుతి న్యూ లుక్.. కళ తప్పిందే!

Tue May 21 2019 09:57:01 GMT+0530 (IST)

Shruti Haasan New Look

ఎండా కాలం వానలా ఆవిడ ఎప్పుడేం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. క్యుములో నింబస్ జల్లులా అప్పటికప్పుడే రాక్ బ్యాండ్ గానా బజానా అంటుంది. అప్పటికప్పుడే సినిమాల్లో నటించేందుకు సై అనేస్తోంది. అలా ఇప్పటికే తన కెరీర్ ని రకరకాలుగా యూటర్నులు తిప్పి ఎటెళుతోందో తెలీని సన్నివేశం నెలకొంది. ఓవైపు తనలోని గాయనీమణిని సంతృప్తి పరుస్తోందా అంటే అదీ లేదు. మరోవైపు అగ్రకథానాయికగా తన రేంజును పెంచుకునే పనిలో పడిందా? అంటే అదీ కాదు. ఎగుడుదిగుడు ఆలోచనలతో శ్రుతి ఇప్పటికే చాలా కోల్పోయింది. ఇలాంటి కన్ఫ్యూజన్ లోనే లండన్ ప్రియుడు మైఖేల్ కోర్సలేతో డేటింగ్.. ప్రేమాయణం.. బ్రేకప్ లు అన్నీ అయిపోయాయి.అప్పట్లో మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో శ్రుతిహాసన్ సినిమా ప్రారంభమైంది. చాలా వరకూ షూటింగ్ చేశారు. కానీ అది పూర్తయిందో లేదో తెలీని సన్నివేశం నెలకొంది. ఈలోగానే ఈ అమ్మడు వేరొక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఆన్ లొకేషన్ నుంచి శ్రుతి ఓ రెడ్ హాట్ ఫోటోని షేర్ చేసి `వర్క్ మోడ్`! అంటూ వ్యాఖ్యను జోడించింది. ``షూట్ .. ముంబై.. వర్క్ మోడ్.. జెట్ లాగ్.. హ్యాపి టు బి బ్యాక్`` అంటూ ఇన్ స్టాలో వ్యాఖ్యను పోస్ట్ చేసింది. శ్రుతి కాస్త మేకప్ లేకుండా నేచురల్ గా కనిపిస్తున్నా.. ముఖకవలికల్లో ఏదో మిస్సయ్యిందనే అనిపిస్తోంది. మొన్నటివరకూ మైఖేల్ కోర్సలే తో లైఫ్ ని ఎంజాయ్ చేసింది. ఇప్పుడు తిరిగి స్ట్రెస్ లైఫ్ లో కి అడుగుపెడుతోంది కాబట్టి ఇలా రూపం మారిం దో ఏమో!!

తిరిగి షూట్ మోడ్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని శ్రుతి చెప్పకనే చెప్పింది. శ్రుతి ప్రస్తుతం ఓ కొత్త సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు టిగ్మన్షు ధూలియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `యారా` పెండింగ్ ప్రాజెక్ట్. ఇందులో విద్యుత్ జమ్వాల్ సరసన శ్రుతి నాయికగా నటిస్తోంది. ఇదో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్  డ్రాప్ సినిమా అని తెలుస్తోంది.